
చిన్నటేకూరు బస్సు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బైక్, బస్సు ప్రమాదం రెండు వేర్వేరు ఘటనలుగా గుర్తించారు పోలీసులు.
V.కావేరి బస్సు ఢీకొట్టడానికి ముందే బైక్ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బైక్ మీద శివశంకర్, ఎర్రిస్వామి ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్ డివైడర్‌ని ఢీకొట్టి రోడ్డుపై పడింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయమై రోడ్డుపైనే శివశంకర్ స్పాట్‌లోనే చనిపోయాడు. బైక్‌పై వెనుక ఉన్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం తర్వత ఎర్రిస్వామి బైక్‌ను పక్కకు లాగేందుకు యత్నించాడు.
అదేసమయంలో బైక్‌ను V.కావేరి బస్సు ఢీకొట్టింది. ఆపై కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లడంతో.. మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రమై కొంత సమయంలోనే బస్సు అంతా తగలబడిపోయింది. పోలీసుల విచారణలో ఎర్రిస్వామి ఈ వివరాలు వెల్లడించాడు. ఎర్రిస్వామి స్టేట్‌మెంట్ ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.