మంత్రి కొడాలి నాని సొంత గ్రామంలో వైసీపీకి ఎదురు దెబ్బ అని కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలను తెలుగుదేశం పార్టీ బలపర్చిన యలమర్రు గ్రామ సర్పంచ్ అనూష ఖండించారు. శనివారం రాత్రి నుండి కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలు అవాస్తమని పేర్కొన్నారు. మంత్రి కొడాలి నానిది గుడివాడ నియోజకవర్గమని.. తమ గ్రామం యలమర్రు పామర్రు నియోజకవర్గంలో ఉందని ఆమె చెప్పారు. తమ గ్రామంలో మంత్రి కొడాలి నాని ఎటువంటి రాజకీయాలు చేయలేదని వెల్లడించారు. గ్రామస్తుల అండదండలతో గెలిచానని.. రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో గ్రామ అభివృద్ధి చేసుకుంటామని నూతన సర్పంచ్‌గా ఎన్నికైన అనూష తెలిపారు.
మరోవైపు మంత్రి కొడాలి నాని కూడా ఈ ప్రచారంపై స్పందించారు. యలమర్రు తన పూర్వికులదని.. తన తండ్రి, తాను గుడివాడలోనే పుట్టామని స్పష్టం చేశారు. యలమర్రు పాలిటిక్స్ తనకు తెలియవని.. ఒకవేళ అక్కడ తాను ప్రచారం చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాయం చేస్తానని సవాల్ విసిరారు. 21 తర్వాత వాస్తవాలను మీడియాతో వెల్లడిస్తానన్న కొడాలి నాని.. అప్పుడు అసలు లెక్కలు తేలుతాయన్నారు.
Also Read:
9 నెలల గర్భంతో ఎన్నికల బరిలోకి.. ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం..
Kurnool Road Accident: కర్నూలు ప్రమాదంపై దిగ్భ్రాంతికర విషయాలు.. చిన్న పొరపాటుకు 14 మంది బలి..