AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Body Elections: ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి.. విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్‌పై ఆదివారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.

AP Local Body Elections: ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి.. విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..
Shiva Prajapati
|

Updated on: Feb 14, 2021 | 5:37 PM

Share

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్‌పై ఆదివారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను మంత్రి కొడాలి నాని ఏమనలేదని మంత్రి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, కొడాలి నాని వ్యాఖ్యలు వేరే వారు మాట్లాడిన వాటితో పోల్చి చూడలేమని ఎస్ఈసీ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే వీడియో ఫుటేజ్ మొత్తం పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు.

దీనికి స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. కొడాలి నాని వీడియో ఫుటేజ్ ఫైల్ చేశారా అని కోర్టు రిజిస్టర్‌ని అడింగింది. రిజిస్టర్ లేదని చెప్పగా.. తామే ఆ వీడియో ఫుటేజీ ఇస్తామని, పరిశీలించాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, ఈ వీడియోను తరువాత పరిశీలిస్తామన్న ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, మంత్రి కొడాలి నాని ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడవద్దు అంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి నాని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Also read:

మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో వైసీపీ ఓటమి అంటూ ప్రచారం.. అసలు విషయం ఆ సర్పంచ్ తేల్చేశారు

GHMC Mayor Love Story: ప్రేమికుల రోజున తమ ప్రేమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మేయర్ విజయలక్ష్మి