Krishna District: ఏం మందు తాగావ్‌రా బాబు… కుక్కను తీసుకొచ్చి పిల్లికి వైద్యం చేయాలంటూ రచ్చ

ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హంగామా చేశాడు. కుక్క పిల్లను తీసుకొచ్చి, నా పిల్లికి వైద్యం చేస్తారా లేదా అంటూ సిబ్బందితో గొడవకు దిగాడు. ఆ కుక్క పిల్లను వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వారు ఎంత చెప్పినా వినలేదు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలిపట్నంలో చోటు చేసుకుంది.

Krishna District: ఏం మందు తాగావ్‌రా బాబు... కుక్కను తీసుకొచ్చి పిల్లికి వైద్యం చేయాలంటూ రచ్చ
Man Behaves Strangely

Updated on: Jun 19, 2024 | 10:18 AM

మందు బాగా ఎక్కువైతే.. కొందరు పడుకుంటారు. ఇంకొందరు మాత్రం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కిక్కు ఎక్కువై మందుబాబులు పడే కథలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి చాలా వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. లేని పోని గొడవల్లో తలదూర్చడం, పందిని చూపించి నంది అనడం చేస్తుంటారు. లిక్కర్ బాగా తాగినవారి విచిత్ర ప్రవర్తన కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు విసుగు అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి మందుబాబు యవ్వారాన్నే మీ ముందకు తీసుకొచ్చాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన వెలుగుచూసింది. మందుబాబు దెబ్చకు ఆస్పత్రి సిబ్బంది నానాయాతన పడ్డారు. ఇంతకీ అతడేం చేశాడో తెలిస్తే.. మీ బుర్ర బ్లాంక్ అవ్వడం ఖాయం.

ఏం మందు తాగాడో ఏంటో కానీ.. ఓ వ్యక్తికి లిక్కర్ కిక్కు పూర్తిగా ఎక్కేసింది.  ఒక బుజ్జి కుక్కు పిల్లను తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ఆ కుక్క పిల్లను చూపించి.. ‘నా పిల్లికి’ వైద్యం చేయమంటూ ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగాడు. ఇక్కడ జంతువులకు వైద్యం చేయరు.. పశువుల ఆస్పత్రికి పోవయ్య బాబూ అని అక్కడి స్టాఫ్ ఎంతో పద్దతిగా చెప్పారు. అయినా మందుబాబు మాట వింటేగా.  కుక్క పిల్లను చూపిస్తూ పిల్లికి వైద్యం చేమంటూ కొద్దిసేపు గొడవ కంటిన్యూ చేశాడు. .’తాగింది నేను కాదు మీరే?’ అంటూ అస్సలు తగ్గలేదు. అతగాడి మొండి వాదనకు అక్కడున్న సిబ్బంది, రోగుల బంధువులు బిత్తరపోయారు. మద్యం కిక్కులో చేస్తున్న అతడి విచిత్ర ప్రవర్తనని చూసి అక్కడి వారు సరదాగా నవ్వుకున్నారు.

మందుబాబు ఎంతకూ తగ్గకపోవడంతో.. ఆస్పత్రి సిబ్బంది పోలీసులను పిలిపించారు. వారు మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది.