EX Minister Shankar Narayana: అనుకోకుండా మంత్రి పదవి వచ్చింది.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మూడేళ్ల పాటు గౌర మర్యాదలు.. ప్రోటోకాల్ ఎక్కిన ఫ్లైట్ ఎక్కకుండా దిగిన ఫ్లైట్ దిగకుండా.. వెళ్లిన ఊరికి వెళ్లకుండా బీజీ బీజీగా పర్యటించిన ఆ మంత్రికి.. ఇప్పుడు పునర్వస్థీకరణ తరువాత మంత్రి పదవి పోయింది.. ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సిన పరిస్థితి… మరి మంత్రి పదవి పోయిన తర్వాత పార్టీ ఆయనకు ఏ బాధ్యతలు అప్పజెప్పంది.. ఆయన లైఫ్ స్టైల్ అప్పుడెలా ఉంది.. ఇప్పుడెలా ఉంది.. ఏపీలోని (Andhra Pradesh)మాజీ మంత్రి శంకర్ నారాయణ తాజా పరిస్థితి గురించి తెలుసుకుందాం..
సీఎం జగన్ క్యాబినెట్ -1 చాలా మంది లక్కీ డిప్ లో మంత్రి పదవి వచ్చినట్టు అవకాశాలు వచ్చాయి. ఇందులో అనంతపురం జిల్లాకు చెందిన శంకరనారాయణ ఒకరు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైన ఆయనకు మొదటి సారే మంత్రి పదవి వరించింది. టీడీపీ కంచుకోటలో ఎమ్మెల్యే అయిన ఆనందంలో ఉన్న శంకరనారాయణకు… ఏకంగా మంత్రి పదవే తలుపు తట్టడంతో ఆయన సుడి ఏ రేంజ్ లో ఉందో అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎమ్మెల్యేకు, మంత్రి పదవికి కొత్త కావడంతో మొదట్లో కాస్త తడబడ్డారు. ఆతరువాత కాస్త తేరుకుని నిలబడ్డారు. మొదట బీసీ సంక్షేమ శాఖ పదవి ఇచ్చారు. కొన్ని రోజులకు కీలకమైన రోడ్ల భవనాలశాఖ మంత్రి పదవికి దక్కింది. అయిుతే మంత్రి అయ్యాక శంకర్ నారాయణ లైఫ్ స్టైల్ ఎక్కడా మారలేదు.
తానున మంత్రి అయ్యానని గర్వం ఎక్కడా ప్రదర్శించలేదు.. అధికారుల మీద పెత్తనం లేదు.. తన సొంత శాఖలో కూడా పెద్దగా వేలు పెట్టలేదు. ఇక ఎమ్మెల్యేలతో కూడా పెద్దగా పేచీలు ఏమీ లేవు. అయితే మంత్రి పదవి ఇనన్ని రోజులు బిజీబీజీగా పర్యటనలు ఉండేవి. ఎక్కిన ఫ్లైట్ ఎక్కకుండా దిగిన ఫ్లైట్ దిగకుండా.. వెళ్లిన ఊరికి వెళ్లకుండా గడిపే వారు. నిత్యం సంక్షేమ, అభివృద్ధికార్యక్రమాల ప్రారంభోత్సవాలు, ప్రైవేట్ కార్యక్రమాలకు ఆహ్వానాలు, ఇక క్యాబినేట్ మీటింగ్ లు, సీఎంతో డిస్కన్ష్ అబ్బో ఒకటేమిటి క్షణం తీరిక లేకుండా ఆయన గడుపుతూ వచ్చారు. కానీ మంత్రి వర్గ పునర్వస్థీకరణ నేపథ్యంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ రెండవ సారి ఛాన్స్ వస్తుందని ఆశతో ఉండే వారు. యధావిధిగా ఎమ్మెల్యే హోదాలో పలు పర్యటనల్లో పాల్గొన్నారు. ఇక ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ గడిపారు.
కానీ మంత్రి వర్గంలో రెండవ సారి ఛాన్స్ వస్తుందని లాస్ట్ మినిట్ వరకు ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా ఆ పదవి తన సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీ కి వెళ్లిపోయింది. దీంతో శంకర్ నారాయణ బాగా డీలా పడిపోయారు. బయట కార్యక్రమాల్లో దాదాపుగా కనిపించలేదనే చెప్పాలి. మూడేళ్ల పాటు తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే కనిపిస్తోంది. కానీ ఎక్కడా తన బాధనో అసంతృప్తినో వ్యక్తం చేయలేదు. కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. శంకర్ నారాయణకు మంత్రి పదవి ఉన్నప్పుడు ఎప్పుడూ హంగు ఆర్భాటం ప్రదర్శించలేదు. చాలా సింపుల్ గా ఉండేవారు. ఇప్పుడూ అలానే ఉన్నారు. కాకపోతే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కాస్త టైం కావాలన్న అభిప్రాయం అనుచరుల నుంచి వ్యక్తమవుతోంది…
అయితే సీఎం జగన్ ముందుగానే చెప్పిన విధంగా మంత్రి పదవి కోల్పోయిన వారికి పార్టీ బాధ్యతలు ఇస్తామని చెప్పినట్టు శ్రీసత్యసాయి జిల్లా బాధ్యతలను శంకర్ నారాయణకు అప్పజెప్పారు. ఇన్ని రోజులు మంత్రిగా కనిపించిన శంకర్ నారాయణ.. ఇక మీద అధ్యక్ష హోదాలో ఒక హడావుడి చేస్తారేమో చూడాలి మరి.
Reporter: Kanth, TV9 Telugu
Also Read: మూడు పెళ్లిళ్లు జరిగాయి.. మరో మహిళతో లవ్.. విషయం తెలిసిన మూడో భార్య ఏం చేసిందంటే..?