Covid 19 Ex-Gratia: ఏడాదికిపైగా విజృంభిస్తున్న కరోనాపై ఏపీ సర్కార్ ఎన్నో చర్యలు చేపట్టింది. కోవిడ్ బారిన పడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. కరోనా పాజిటివ్ కేసులను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉంది. ఇక తాజాగా కోవిడ్ బాధితుల సహాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను చెల్లించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కోవిడ్ మృతుల జాబితా రూపొందించి దానికి అనుగుణంగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఇక మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తు తీసుకున్న రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు కోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించిన వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్ మృతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంలో ఎలాంటి ఆలసత్వం వహించరాదని, త్వరగా వారి కుటుంబాలకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
కోవిడ్ సహాయంపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు:
covid-19 ex-gratia amount 50,000
ఇవి కూడి చదవండి: