ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. దీనికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నారు. జనసేన పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్టీ నేత చింతల పార్థసారథిలు బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణ, పటిష్ఠ నిర్మాణంతోపాటు ఆవిర్భావ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలో సభా వేదిక, నిర్వహణ తేదీలను ప్రకటించనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయాన్నితీసుకెళ్తామన్నారు చంద్రశేఖర్.
వేగంగా ఏపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు జరగాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భారీఎత్తున సభ్యత్వ నమోదు, నిర్మాణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీల రూపకల్పన చేయాలని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్ నిర్దేశాల మేరకు ఏపీ పార్టీ ముందుకు తీసుకెళ్తామని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉందని.. పెద్దఎత్తున చేరికలుంటాయని.. ఇప్పటికే వివిధ పార్టీల సీనియర్ నేతలు అడుగుతున్నారని వెల్లడించారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం