AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు.. హాజరు కానున్న కేసీఆర్‌.. పలు కీలక అంశాలపై డైరెక్షన్..

ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, పార్టీ నేత చింతల పార్థసారథిలు బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణ..

BRS: ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు.. హాజరు కానున్న కేసీఆర్‌.. పలు కీలక అంశాలపై డైరెక్షన్..
Chandra Shekar
Sanjay Kasula
|

Updated on: Jan 05, 2023 | 9:14 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. దీనికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) హాజరుకానున్నారు. జనసేన పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, పార్టీ నేత చింతల పార్థసారథిలు బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణ, పటిష్ఠ నిర్మాణంతోపాటు ఆవిర్భావ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలో సభా వేదిక, నిర్వహణ తేదీలను ప్రకటించనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ నిర్ణయాన్నితీసుకెళ్తామన్నారు చంద్రశేఖర్‌.

వేగంగా ఏపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు జరగాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భారీఎత్తున సభ్యత్వ నమోదు, నిర్మాణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీల రూపకల్పన చేయాలని కేసీఆర్‌ తెలిపారు.

కేసీఆర్‌ నిర్దేశాల మేరకు ఏపీ పార్టీ ముందుకు తీసుకెళ్తామని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉందని.. పెద్దఎత్తున చేరికలుంటాయని.. ఇప్పటికే వివిధ పార్టీల సీనియర్ నేతలు అడుగుతున్నారని వెల్లడించారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్