AP: ఆ కుటుంబానికి ఎంతో దగ్గరిగా మెలిగా.. మంత్రి పదవి రాకపోవడంపై ధర్మశ్రీ కన్నీళ్లు

ఏపీలో కొత్త మంత్రులతో కొలువుదీరిన కేబినెట్, దాని తాలూకా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అసంతృప్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AP: ఆ కుటుంబానికి ఎంతో దగ్గరిగా మెలిగా.. మంత్రి పదవి రాకపోవడంపై ధర్మశ్రీ కన్నీళ్లు
Karanam Dharmasri

Updated on: Apr 11, 2022 | 3:18 PM

ఏపీలో కొత్త మంత్రులతో కొలువుదీరిన కేబినెట్, దాని తాలూకా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అసంతృప్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ బాధను చెబుతుండగా.. మరికొందరు మాత్రం లోలోపల కుమిలిపోతున్నారు. మంత్రి పదవి దక్కని చౌడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ(Karanam Dharmasri )కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాన్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో ఏం జరుగుతోందో సీఎం(CM Jagan)కు తెలియకపోవడం వల్లే కొన్ని నిర్ణయాల్లో తప్పులు జరుగుతున్నాయన్నారు ధర్మశ్రీ. కార్యకర్తలు ఆందోళనలు చేయొద్దని ఆయన కోరారు. వైఎస్సార్(Ysr) నుంచి జగన్ వరకు కుటుంబం పరంగా ఎంతో అనుబంధం ఉందన్నారు. ఏం సమీకరణాలు కుదరలేదో  తెలియదని.. కానీ తనకు అన్యాయం జరిగిందన్నారు. తాను వేరే పార్టీ నుంచి రాలేదని.. వేరే పార్టీలు ప్రలోభ పెట్టినా పార్టీ మారలేదని బాధను వ్యక్తం చేశారు.  ఆయన ఆవేదనను దిగువ వీడియోలో చూడండి…

Also Read: Viral: ఛాలెంజ్​ పేరుతో పైత్యం.. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్