Breaking: AP EAPCET 2022 నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా..

Breaking: AP EAPCET 2022 నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
Ap Eapcet 2022
Follow us

|

Updated on: Apr 11, 2022 | 3:30 PM

AP EAPCET 2022 Exam date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ  ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ రోజు (ఏప్రిల్‌ 11) నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ రెండో ఏడాది పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష జులై 4 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఏపీ ఈఏపీసెట్‌ ద్వారా బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఈ ఏడాది నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌ 2022)లో ఇంటర్‌ వెయిటేజీ తొలగించనున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెయిటేజీ తొలగిస్తే 100 శాతం మార్కల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారన్నమాట. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in/APSCHEHome.aspx ను చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్‌ 2022 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP Polycet 2022 exam date: ఏపీ పాలీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..