కాణిపాకం అభిషేకం టికెట్లపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ వివరణ ఇచ్చారు. కాణిపాకం అభిషేకం టికెట్ ధరలు పెరగలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.700 ధర యథాతథమని, టికెట్ ధరల పెంపుపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నామని అన్నారు. ఆలయ అధికారుల అవాహనా రాహిత్యం ఇలా జరిగిందని, దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే స్వామివారి పంచామృత అభిషేకం టికెట్ ధరలను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ టికెట్ ధర ఏకంగా 7 రేట్లు పెంచుతున్నట్లు, ప్రస్తుతం ఉన్న అభిషేకం టికెట్ ధర రూ.700 నుంచి రూ.5000 వరకు పెంచినట్లు వచ్చాయి.
ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ధర భారీగా పెంచినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో మంత్రి స్పందించారు. ధరల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. అయితే, ఈ పంచామృతాభిషేకం పెంచిన ధరలపై 15 రోజుల్లోగా తమ అభిప్రాయాలను సేకరించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి