Kamma Vs Kuruba: ఏపీలో కులాల చిచ్చు రేపిన గోరంట్ల వీడియో.. సై అంటే సై అంటున్న కమ్మ, కురుబ వర్గ నేతలు

|

Aug 07, 2022 | 5:17 PM

కొంతమందిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎంపీ గోరంట్ల కామెంట్ చేశారని, కేవలం ఇద్దరుముగ్గురి పేర్లు చెప్పినంత మాత్రాన కమ్మవాళ్లందరూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు కురుబ కులస్థులు.

Kamma Vs Kuruba: ఏపీలో కులాల చిచ్చు రేపిన గోరంట్ల వీడియో.. సై అంటే సై అంటున్న కమ్మ, కురుబ వర్గ నేతలు
Kamma Vs Kuruba In Ap
Follow us on

Kamma Vs Kuruba: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో ఆంధ్రప్రదేశ్ లో కొత్త టర్న్ తీసుకుంది. రెండు కులాల మధ్య చిచ్చు రేపింది. ముఖ్యంగా… రాయలసీమలో కురబ వర్సెస్‌ కమ్మ సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తేడాలొచ్చేశాయి. రెండు కులాల నుంచి తగ్గేదే లే అంటూ తొడల కొట్టే సౌండ్లు… ఓపెన్ ఛాలెంజ్‌లు చేస్తున్నారు. ఈరోజు అనంతపురంలో చంద్రబాబు, లోకేష్‌ బ్యానర్లతో కమ్మవర్గానికి వ్యతిరేకంగా కురబల ర్యాలీ జరిగింది. అటు తమ కులాన్ని గోరంట్ల కించపరిచారని విమర్శిస్తూ కమ్మవర్గం కదిరిలో ర్యాలీ చేసింది. అంతేకాదు అనంతపురంలో గోరంట్ల ఇంటిని ముట్టడిస్తామన్న హెచ్చరికలతో పోలీసుల అలర్ట్‌ అయ్యారు. గోరంట్ల ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అటు.. గోరంట్లకు అండగా ఆయనింటి వద్ద అనుచరులు పహారా కాస్తున్నారు.

కొంతమందిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎంపీ గోరంట్ల కామెంట్ చేశారని, కేవలం ఇద్దరుముగ్గురి పేర్లు చెప్పినంత మాత్రాన కమ్మవాళ్లందరూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు కురుబ కులస్థులు. తెలుగుదేశం కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వీడియో నిజామా,  ఫేకా తెలీకముందే రచ్చ చేస్తున్నారని కురుబ వర్గం ఆరోపిస్తోంది. కురుబ సామాజిక వర్గం నేతలను చట్టసభల్లోకి రానివ్వకుండా కుట్ర చేస్తున్నారని వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఒక్క గోరంట్లను ఆపితే అంతా ఆగిపోతుందన్నదే వాళ్ల కుట్రని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అటు అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిణామాలతో ఏపీలోని మొత్తం కమ్మ సామాజిక వర్గం అలెర్ట్ అయింది. అనంతపురంలో గోరంట్లకు వ్యతిరేకంగా కమ్మకుల సంఘాల నేతలు రోడ్డెక్కాయి. అంబేద్కర్ సర్కిల్‌లో కమ్మ సామాజికవర్గం తరఫున నిరసన ర్యాలీ జరిగింది. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని అల్టిమేటమ్ ఇచ్చారు. లేకపోతే గోరంట్లను అనంతపురంలోకి రానివ్వబోమని హెచ్చరించారు కమ్మ నేతలు. బెజవాడలో ప్రెస్ మీట్ పెట్టిమరీ గోరంట్లను హెచ్చరించారు కమ్మ సంఘం నేతలు. వ్యక్తులు- వ్యక్తులకి మధ్య ఇష్యూ ఉంటే సామాజిక వర్గాలను లాగటం ఏమిటని ప్రశ్నించారు.

ఎంతోమందికి సామాజిక సేవ చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే కమ్మ వాళ్లను ఇతర కులాలకు దూరం చేసే విధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో తమకు 300కు పైగా సంఘాలు ఉన్నాయని, కమ్మ యువత రగిలిపోతోందని చెప్పారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గోరంట్ల ఇల్లు దాటి బైటికి రాలేదని హెచ్చరిస్తున్నారు.

అనంతలో పుట్టిన ఈ చిచ్చు రాయలసీమను దాటి… ఏపీ వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతోంది. కమ్మ నేతలకు ధీటుగా కురుబలు కూడా రియాక్టవ్వడం మొదలుపెట్టడంతో.. చిచ్చు పీక్స్‌కి చేరింది. ఎంపీ గోరంట్లకు లైఫ్ థ్రెట్‌ ఉందనే దాకా వెళ్లింది వ్యవహారం. న్యూడ్ వీడియో రియలా ఫేకా అనేది తేలిన తర్వాత కూడా ఈ రెండు కులాల మధ్య వచ్చిన గ్యాప్‌ మాత్రం పొయ్యేలా కనిపించడం లేదు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..