ఏపీ సర్కార్ ఇటీవల మద్యం ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గించింది ప్రభుత్వం. దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. మద్యం దుకాణలకు దిష్టి తీసిన సీన్స్ ఇటీవల తారసపడ్డాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామానికి చెందిన కూలి రైతు గోవిందు కూడా మద్యం ప్రియుడు. రాష్ట్రంలో మద్యం ధరలు తెగ సంబరపడిపోయాడు. ఆ ఆనందంలో అతిగా మద్యం తాగాడు. తాగి తాగి చివరికి అపస్మారక స్థితిలోకి జారుకుని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన గోవిందును అతని తల్లి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించింది. ట్రీట్మెంట్ చేశారు కానీ…అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు అనంతపురం తరలించారు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది.
గోవిందు రోజూ మద్యం తాగేవాడని… సర్కార్ మద్యం ధరలు తగ్గించడంతో గత రెండు రోజుల నుంచి కొంచెం అధికంగా మద్యం సేవించినట్లు బాధితుని తల్లి వెల్లడించింది. కాగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు మద్యం ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Telangana: పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్