Andhra Pradesh: ‘పన్ను చెల్లించకపోతే ఇళ్ల సామాన్ల జప్తు’.. టీవీ9 దెబ్బకు దిగొచ్చిన కాకినాడ మున్సిపల్‌ శాఖ..

Andhra Pradesh: ఆస్తి పన్ను చెల్లించడంలో జాప్యం చేసి వారి ఇళ్లలోని సామానులను జప్తే చేస్తామని కాకినాడ మున్సిపాలిటీ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా మున్సిపాలిటీ అధికారులు ఏకంగా సామానులను..

Andhra Pradesh: పన్ను చెల్లించకపోతే ఇళ్ల సామాన్ల జప్తు.. టీవీ9 దెబ్బకు దిగొచ్చిన కాకినాడ మున్సిపల్‌ శాఖ..

Updated on: Mar 18, 2022 | 4:27 PM

Andhra Pradesh: ఆస్తి పన్ను చెల్లించడంలో జాప్యం చేసి వారి ఇళ్లలోని సామానులను జప్తే చేస్తామని కాకినాడ మున్సిపాలిటీ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా మున్సిపాలిటీ అధికారులు ఏకంగా సామానులను జప్తు చేయడానికి వాహనాలను కూడా రంగంలోకి దింపారు. ‘ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించని ఇంటి యజమానుల సామాన్లు తీసుకుపోవు జప్తు వాహనము’ అంటూ కొన్ని వాహనాలు నగరంలో హల్చల్‌ చేశాయి. ఈ విషయాన్ని టీవీ9 పలుసార్లు ప్రసారం చేయగా, తీవ్ర చర్చనీయాశంగా మారింది. దీంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

టీవీ కథనానికి స్పందించిన స్మార్ట్‌ సిటీ కాకినాడ కమిషనర్‌, స్వప్నిల్‌ దినకర్‌ స్పందించారు. ఇళ్లలో సామాన్లు జప్తు విషయమై వివరణ ఇచ్చారు. సకాలంలో పన్నులు చెల్లించకపోతే ఇళ్లు జప్తు చేసే విధానం ఎన్నో ఏళ్లుగా ఉంది. పన్నులు చెల్లించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకునే జప్తు వాహనాలను ఏర్పాటు చేశాము. అయితే ప్రస్తుతం ఈ వాహనాలను నిలిపివేశాము. ప్రజలంతా మున్సిపల్‌ శాఖకు సహకరించి మార్చి 31 లోపు పన్నులు చెల్లించాలని స్వప్నిల్‌ దినకర్‌ పిలుపునిచ్చారు. ఇళ్ల సామానుల జప్తు వాహనాలపై తీవ్ర విమర్శలు రావడంతో మున్సిపల్‌ శాఖ వెనుకడుగు వేసింది.

Also Read: Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..

Viral Video: బాబోయ్..ఏందిది.. మొసలితో సయ్యాట.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్..