Andhra Pradesh: కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో కలకలం.. ఉన్నట్లుండి కళ్లు తిరిగిపోయిన విద్యార్థులు.. కారణమేంటంటే?

|

Sep 07, 2022 | 7:53 AM

Kakinada: విష వాయువులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో డేంజర్ కెమికల్స్ పీల్చిన స్టూడెంట్స్‌ అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడం కన్నవాళ్లకు కునుకు లేకుండా చేసింది.

Andhra Pradesh: కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో కలకలం.. ఉన్నట్లుండి కళ్లు తిరిగిపోయిన విద్యార్థులు.. కారణమేంటంటే?
Students
Follow us on

Kakinada: విష వాయువులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో డేంజర్ కెమికల్స్ పీల్చిన స్టూడెంట్స్‌ అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడం కన్నవాళ్లకు కునుకు లేకుండా చేసింది. కాకినాడ వలసపాకలలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం స్కూల్‌లో పాఠాలు జరుగుతుండగానే 18 మంది పిల్లలు ఊపిరాడక కళ్లుతిరిగి పడిపోయారు. 5, 6, 7 తరగతుల్లోని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పేరెంట్స్‌కి సమాచారం ఇచ్చి పిల్లలను సమీపంలోని హాస్పిటల్‌లో చేర్చారు. తర్వాత జీజీహెచ్‌కి తరలించి వైద్యం అందించారు. విష వాయువు పీల్చగానే కళ్లు తిరిగాయన్నారు విద్యార్థులు.

కాగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారనే సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌.. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరగరానిది జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. చికిత్స తర్వాత అస్వస్థతకు గురైన 18 మంది కోలుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడ దృష్టి సారించింది. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయమై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో మాట్లాడారు. విద్యార్ధులకు మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..