AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellow Frogs: వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? పెద్ద కథే..

సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో మనకు పసుపు రంగు కల్పలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కనిపిస్తే వర్షాకాలం ప్రారంభం అయినట్టేనని చాలా మంది నమ్ముతారు. ఇలాగే కైకలూరులో పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమై సందడి చేశాయి. నార్మల్‌ ఆడ కప్పలను ఆకర్షించడానికి మగ కప్పలు రంగులు మారుస్తుంటాయి. కానీ ఈ వింత వెనుక సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? అయితే అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Yellow Frogs: వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? పెద్ద కథే..
Yellow Frogs Kaikaluru
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 02, 2026 | 12:18 PM

Share

ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా ఏలూరు జిల్లా కైకలూరు ప్రాంతంలో అలాంటి ఒక వింతే వెలుగుచూసింది. సాధారణంగా గోధుమ , పచ్చ రంగులో ఉండే కప్పలు.. ఒక్కసారిగా మెరిసిపోయే పసుపు రంగులోకి మారి ప్రత్యక్షమవడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వీటిని పలువురు తమ కెమెరాల్లో బంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లా కైకలూరు టౌన్‌హాల్ గ్రౌండ్‌లోకి భారీగా నీరు చేరింది. ఆ నీటిలో నుంచి అకస్మాత్తుగా పసుపు రంగులో మెరుస్తున్న కొన్ని కప్పలు బయటకు వచ్చాయి. ఈ వింత జీవులను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ కప్పల శాస్త్రీయ నామం ‘హూప్లోచాట్రాసస్ టైగిరినస్’. వీటిని సాధారణంగా ఇండియన్ బుల్ ఫ్రాగ్’అని పిలుస్తారు. మన తెలుగు ప్రాంతాల్లో వీటిని తవుడు కప్పలు లేదా బోదరు కప్పలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి దాదాపు 17 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.

కప్పలు పసుపు రంగులోకి ఎందుకు మారాయి?

కప్పలు రంగు మారటం వెనుక వింత, దైవిక అద్భుత ఏమి లేదని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన జీవశాస్త్ర లక్షణం ఉందంటున్నారు. కేవలం వర్షాకాలంలో జతకట్టే సమయంలో మాత్రమే మగ కప్పలు తమ శరీరాన్ని ఇలా ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మార్చుకుంటాయని చెబుతున్నారు. ఆడ కప్పలను ఆకర్షించేందుకే ప్రకృతి వీటికి ఈ శక్తిని ఇచ్చిందని అంటున్నారు.అంతే కాదు ఈ మగ కప్పలు శబ్దాలు చేసేటప్పుడు వాటి గొంతు భాగంలో ఉండే రెండు స్వరపేటికలు నీలం రంగులోకి మారుతూ వింత శబ్దాలు చేస్తాయి. వర్షాకాలం ముగిసి, జతకట్టే ప్రక్రియ పూర్తి కాగానే ఇవి మళ్లీ తమ పాత సాధారణ రంగులోకి వచ్చేస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే ఈ ఇండియన్ బుల్ ఫ్రాగ్స్ సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. చెరువులు పూడిపోవడం, కాలుష్యం పెరగడం వల్ల వీటి ఉనికి ప్రమాదంలో పడుతోందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!