Andhra News: అయ్యో ఎంత విషాదం.. ట్రైన్‌ కిందపడి కుటుంబం ఆత్మహత్య.. అసలు కారణం ఇదే..

కడప జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో నేపథ్యంలో భార్యాభర్తలు, ఏడాదిన్నర కుమారుడితో సహా గూడ్స్‌ ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra News: అయ్యో ఎంత విషాదం.. ట్రైన్‌ కిందపడి కుటుంబం ఆత్మహత్య.. అసలు కారణం ఇదే..
Andhra News

Updated on: Oct 13, 2025 | 8:55 AM

కడప జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో నేపథ్యంలో భార్యాభర్తలు, ఏడాదిన్నర కుమారుడితో సహా గూడ్స్‌ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11గం. సమయంలో ఈ ఘటన జరిగింది. కడప- కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై ఒక కుటుంబ వేగంగా వస్తున్న గూడ్స్‌ ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తర్వాత పోస్ట్‌మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుంతా ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలు, కుమారుడిగా గుర్తించారు. వారు శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష, కుమారుడు రిత్విక్‌గా నిర్ధారించారు. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా, లేక మరో ఇతర కారణాలేమైనా ఉన్నాయ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.