Andhra Pradesh: మాటలకందని ఆవేదన వారిది. అండగా ఉండే తండ్రిని ప్రాణాలతో చూడాలని కోరుకుంటున్నారు ఆ పిల్లలు. తమ తండ్రి ఆచూకి కోసం వాగు వంక, చెట్టు పుట్టా వెతుకుతున్నారు. ఇటీవల కడప జిల్లాలో కురిసిన వర్షాలు ఎన్నో చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతోమంది నిరాశ్రయులు అయ్యారు. వరదల కారణంగా తాజాగా మరో కుటుంబం రోడ్డున పడింది. వారి గాధ వింటే కన్నీరు ఆగదు. ‘‘వెలుగు చీకటి లోన.. తోడై నిలిచే నాన్న.. వదిలేసావ మమ్మల్నీ యెడబాటున..’’ అంటూ ఆయన పిల్లలు ఇలా నది తీరం వెంట వెతుకులాడుతున్నారు.
కడప జిల్లా రాజంపేటకు చెందిన ఓ కుటంబం దీనగాధ ఇది. రాజంపేట చెయ్యేరు పరివాహా ప్రాంతం బాలరాజుపల్లెలో షేక్ సజ్జర్ బాషా అనే పశువులకాపరి శనివారం నాడు గల్లంతయ్యాడు. నదిలో కొట్టుకుపోయిన తండ్రి కోసం ఆయన కూతుళ్లు, కుమారులు వెతుకుతున్నారు. పగలు, రేయి అనకా ఆచూకీ కోసం పరితపిస్తున్నారు సజ్జర్ బాషా కుటుంబసభ్యులు. కానీ వారికి స్థానిక అధికారులు, పోలీసులు సహకరించకపోవడం విచారం అని అంటున్నారు స్థానికులు. షేక్ సజ్జర్ బాషాకు భార్య, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ఇంటి పెద్ద నదిలో కొట్టుకుపోవడంతో శోక సంద్రంలో మునిగింది ఆ కుటుంబం. ఇప్పటివరకు మృతదేహం లభ్యం కాలేదు. దీంతో అధికారుల సాయం కోరుతోంది ఆ కుటుంబం.
Also read:
Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..
Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం