జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్..

బీజేపీతో జనసేనాని చేతులు కలపడంపై.. ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పందించారు. పవన్ కల్యాణ్ కేవలం పవర్ కోసమే పార్టీ పెట్టారని.. ఆయనకు ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రాదని ముందే చెప్పానన్నారు. ఆయన పోటీ చేసే సొంత సీటును కూడా పవన్ కల్యాణ్ గెలవడని ముందే చెప్పానన్నారు. బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీ, జేడీ లక్ష్మినారాయణ టీంలతో కలిసి పొత్తులు పెట్టుకున్నాడని.. అయినా కూడా సొంత సీటు కూడా గెలవలేకపోయాడన్నారు. […]

జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్..

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2020 | 11:43 AM

బీజేపీతో జనసేనాని చేతులు కలపడంపై.. ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పందించారు. పవన్ కల్యాణ్ కేవలం పవర్ కోసమే పార్టీ పెట్టారని.. ఆయనకు ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రాదని ముందే చెప్పానన్నారు. ఆయన పోటీ చేసే సొంత సీటును కూడా పవన్ కల్యాణ్ గెలవడని ముందే చెప్పానన్నారు. బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీ, జేడీ లక్ష్మినారాయణ టీంలతో కలిసి పొత్తులు పెట్టుకున్నాడని.. అయినా కూడా సొంత సీటు కూడా గెలవలేకపోయాడన్నారు. నూటికి ఇరవై ఐదు శాతం ఉన్న ఆయన సొంత సామాజిక వర్గం అయిన కాపులే ఆయనకు ఓటు వేయలేదన్నారు. మొత్తం ఆరుశాతం ఓట్లు మాత్రమే పడ్డాయన్నారు. గతంలో అన్నయ్య చిరంజీవికి 18 శాతం పడితే.. ఇప్పుడు తమ్ముడికి ఆరు శాతం మాత్రమే పడ్డాయని.. అది కూడా మూడు నాలుగు పార్టీలతో పొత్తు పెట్టకుంటేనంటూ ఎద్దేవా చేశారు.