AP High Court: నేడు ఏపీ హైకోర్టు సీజేపీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం..

|

Oct 13, 2021 | 8:59 AM

AP High Court: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ట్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి...

AP High Court: నేడు ఏపీ హైకోర్టు సీజేపీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం..
Ap High Court
Follow us on

AP High Court: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ట్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మిశ్రాతో సీజేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, హైకోర్టు అధికారులు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. కాగా, జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా ఇప్పటికే విశాఖపట్నం నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు అధికారులు.

1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్​లోని రాయగఢ్​లో జన్మించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర.. బిలాస్పూర్​లోని గురుఘసిదాస్ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్‌బీ నుంచి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాది వృతి చేపట్టారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు , మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ఇప్పుడు పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also read:

Nobel Prize Journalists: నిజంగా అద్భుతమే ‘నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్న ఇద్దరు విలేకరులే..!(వీడియో)

Petrol Diesel Price: రోజు రోజుకు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Allu Arjun in Tahsildar office: ఆస్తుల విషయంలో తహశీల్దార్‌ ఆఫీసుకి వెళ్లిన అల్లు అర్జున్‌.. ఎగబడ్డ జనం..! అసలెందుకు వెళ్లారంటే..(వీడియో)