టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్‌లతో రచ్చ చేశారు. అవును
చంద్రబాబు పల్నాడు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ర్యాలీలో కొంతమంది అభిమానులు.. ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. చంద్రబాబు వాహనానికి ఎదురుగా ఎన్టీఆర్ ఉన్న జెండాలు పట్టుకుని హంగామా చేశారు. నిజానికి నిన్నటి చంద్రబాబు టూర్‌లో టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఫ్లెక్సీలు, జెండాలు పట్టుకుని చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. లోకేష్ ఫ్లెక్సీలు, అన్న NTR ఫొటోలతో ర్యాలీలో కనిపించారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జెండాలు పట్టుకుని మరికొందరు అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. ఈ సమయంలోనే టీడీపీ కార్యకర్తలు లోకేష్ ఫోటోలు పట్టుకుని హడావుడి చేశారు.
చంద్రబాబు పర్యటనలో జూనియర్ అభిమానులు హంగామా చేయడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కుప్పంలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రసంగానికి అడ్డు తగులుతూ కొందరు NTR నినాదాలు చేయడంతో ఇబ్బందిపడ్డారు. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అవే సీన్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..