కుప్పంలో ఇంట్రస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. ‘సీఎం ఎన్టీఆర్’ నినాదాలతో పట్టణం హోరెత్తింది. చంద్రబాబు ఇలాకాలో.. కుప్పం నడిబొడ్డున… వినిపించిన ఈ స్లోగన్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ‘జై ఎన్టీఆర్’..’CM ఎన్టీఆర్’..’బాబులకే బాబు తారక్‌బాబు’.. స్లోగన్లు ఆదివారం రోజున చిత్తూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చను లేవనెత్తాయి. ఇప్పుడు NTR సినిమా ఏం లేదు? అయినా ఫ్యాన్స్ అంతా ఒక్కచోట చేరారు. కుప్పంను వేదికగా చేసుకున్నారు. ‘సీఎం’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు.. జెండాలు పట్టుకొని డ్యాన్సులు వేశారు.. బాణాసంచా కాల్చి సందడి చేశారు. కుప్పంలో జై లవకుశ స్పెషల్ షో ఏర్పాటు చేసి.. వందల సంఖ్యలో అక్కడికి చేశారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు? ఇదేగా మీ డౌట్..!. అక్కడికి వస్తున్నాం.
ఇటీవల వర్ల రామయ్య చేసిన కామెంట్స్ టీడీపీలో కొత్త కాకను రేపాయి. మేనత్త భువనేశ్వరిని దూషించిన వారిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన సరిగా లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ తన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలను నియంత్రించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టయ్యారు. వర్ల రామయ్య నుంచి వచ్చిన ఆ సౌండ్‌కు..రీసౌండే తాజా కుప్పం ఎపిసోడ్.
ఏపీ అసెంబ్లీలో ఆ మధ్య జరిగిన రచ్చ గుర్తింది కదా..! తన భార్యను దూషించారంటూ చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో నందమూరి ఫ్యామిలీ అంతా రియాక్ట్ అయ్యింది. ఇదే లాస్ట్ ఛాన్స్.. మళ్లీ రిపీట్ అయిందో జాగ్రత్త అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే తారక్ రియాక్షన్ టీడీపీకి నచ్చలేదు. కట్ట విరగకుండా ..పాము చావకుండా..చాలా సాఫ్ట్‌గా స్పందించారన్నది వాళ్ల వర్షన్. అందుకే NTR టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఈ యాక్షన్‌కు రియాక్షన్ ఇప్పుడు కుప్పంలో వస్తోంది. ఫ్యాన్స్ వాళ్లంత వాళ్లుగా ఈ హంగామా చేశారా? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read: AP Weather: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్