కొండగట్టు అంజనేయస్వామి సాక్షిగా ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. టీవీ9తో ఎక్స్‌క్లూజీవ్‌గా మాట్లాడిన పవన్.. పొత్తులపై మూడు ఆప్షన్స్ చెప్పారు. ఆప్షన్ 1 గా.. ఇప్పటి వరకు బీజేపీతోనే ఉన్నాం, ఉంటాం అని ఉద్ఘాటించారు పవన్. ఆప్షన్ 2 లో బీజేపీ తమను కాదంటే ఒంటరిగా వెళ్తామని స్పష్టం చేశారు. ఆప్షన్ 3లో అదేదీ కుదరకపోతే కొత్త పొత్తులకూ సిద్ధం అని ప్రకటించారు జనసేనాని పవన్. అయితే, ఈ మూడు ఆప్షన్స్ ఎన్నికలకు వారం ముందు తేలుస్తుందన్నారు. ఏ పార్టీతో పొత్తు ఉంటుంది.. ఏ పార్టీతో కలిసి వెళ్లాలి అనేది ఎన్నికలకు వారం రోజు ముందు స్పష్టత వస్తుందని తెలిపారు పవన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..