రైతులకు అండగా నిలవడం తమ బాధ్యత అని, బురద రాజకీయాలు చేయడం చేతకాదని జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారన్న పవన్… వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో అధికార పక్షం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మేళిగనూరు, ప్రకాశం జిల్లా కాటూరివారి పాలెం లో జరిగన రైతు ఆత్మహత్య(Suicide) ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. వారు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. బాధ్యత గల పార్టీగా జనసేన కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్నవారి గురించి మాట్లాడుతుంటే పాలక పక్షం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని మండిపడ్డారు.
రైతులకు అండగా నిలవడం జనసేన ఒక బాధ్యతగా చేపట్టింది. బురద రాజకీయాలు చేతకాదు. ఆత్మహత్యలపై కూడా రాజకీయాలు మాట్లాడటం కట్టిపెట్టి అన్నదాతలకు ఏ విధమైన తోడ్పాటు ఇవ్వాలో బాధ్యతగల పదవుల్లో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే మేలు. రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు, భూ యజమానులకు ఊరట ఇస్తామని ఐఏఎస్ అధికారులు ప్రెస్ మీట్ ద్వారా వివరించడం రైతులకు కాస్త ఊరట కలుగుతుంది. భూ రికార్డుల్లో పొరపాటును సరిచేయమని అధికారుల చుట్టూ తిరిగి విసిగి శ్రీ ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉన్నత స్థాయి అధికారుల్లో కదలిక తెచ్చిందని అర్థమవుతోంది. రైతు సమస్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆదేశాలు ఇచ్చినా క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వెనుక ఏవైనా రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి.
– జనసేన
సాగు నష్టాలు, అప్పులు, భూ రికార్డుల్లో లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొని, ఆత్మహత్యల దిశగా రైతులు ఆలోచన చేసే పరిస్థితులు రాకుండా వ్యవస్థలు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాలని పవన్ సూచించారు. ఉన్నతస్థాయి రెవెన్యూ, సర్వే అధికారులతో పాటు జిల్లా స్థాయిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రైతులలో మనోస్థైర్యం నింపే దిశగా చొరవ తీసుకోవాలని కోరారు. వారి సమస్యల సత్వర పరిష్కారానికి మానవతా దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
Nabha Natesh: దేవకన్యలా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. అందాలతో మతిపోగొడుతున్న నభా నటేశ్
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. రాబోయే మూడు రోజులు..
వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల తార కళ్యాణి ప్రియదర్శన్..