Andhra Pradesh: సమైక్యాంధ్ర చేస్తే రాజధాని ఎక్కడో ముందు చెప్పాలి.. వైసీపీకి జనసేన కౌంటర్..

|

Dec 09, 2022 | 5:00 PM

రాష్ట్రంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయనగరంలో పర్యటించిన ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఇటీవల ప్రకటించిన 25 మండలాల..

Andhra Pradesh: సమైక్యాంధ్ర చేస్తే రాజధాని ఎక్కడో ముందు చెప్పాలి.. వైసీపీకి జనసేన కౌంటర్..
Nadendla Manohar
Follow us on

రాష్ట్రంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయనగరంలో పర్యటించిన ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఇటీవల ప్రకటించిన 25 మండలాల పార్టీ అధ్యక్షులకు శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరం ప్రాంతానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు విశాఖను పాలన రాజధాని చేస్తే తప్పు ఏంటి అని అడుగుతారని, మరోవైపు వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను కలిపితే స్వాగతిస్తామంటారని.. అలా కలిపితే రాజధానిని ఎక్కడ పెడతారో ముందు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ నాయకుల మాటలు వాళ్లకే అర్ధం కాని విధంగా ఉన్నాయన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి ఇలాంటి మాటలు మాట్లాడడం వైసీపీకి కొత్త కాదన్నారు. కుటుంబ పాలన సాగించే వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఉత్తరాంధ్ర నుంచి పదవులు అనుభవించిన ఇతర ప్రాంతాల నాయకులు ఇక్కడకు వచ్చి అభివృద్ధి చేయాలని చెప్పడం చూస్తే జాలి వేస్తుందన్నారు. పదవులు పొందేది మీరు.. అభివృద్ధి చేయాల్సింది మాత్రం వేరే వాళ్లా… ఇదేం న్యాయమని ప్రశ్నించారు. ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి రకరకాలుగా మాట్లాడటం మాత్రమే తెలిసిన విద్యని విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఉద్యోగుల జీతాలు సమస్య నుంచి దృష్టి మళ్లించడానికి ఇప్పుడు సమైక్యం అనే మాటలు మాట్లాడుతున్నారన్నారు.

పార్టీ కోసం మొదటి నుంచి నిలబడిన నాయకులు… ప్రజా సమస్యల పట్ల పోరాడే నైజం… నిస్వార్ధంగా పార్టీ జెండాను పట్టుకుని నిలబడగలిగే ధైర్యం ఉన్న నాయకులనే జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నా్మన్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించి అందర్నీ కలుపుకొని వెళ్లి, ఒకరు వేలెత్తి చూపించకుండా స్ఫూర్తివంతంగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా విజయనగరంలో కుటుంబ పాలన పోవాలని, కొత్త తరం పాలన మొదలు కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు నాదెండ్ల మనోహర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..