సేనానికి షాక్.. సీఎం జగన్‌కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం..!

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రవేశ పెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన చెప్పారు. అక్కడితో ఆగలేదు. ఆటో డ్రైవర్లతో కలిసి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారం జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:51 am, Sat, 19 October 19
సేనానికి షాక్.. సీఎం జగన్‌కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం..!

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రవేశ పెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన చెప్పారు. అక్కడితో ఆగలేదు. ఆటో డ్రైవర్లతో కలిసి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారం జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా ఒకేరోజు అటువైపు పార్టీ అధినేత పవన్ కళ్యాన్..జగన్ ప్రభుత్వంపై పొలిట్ బ్యూరో సమావేశంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయగా..ఆయన పార్టీ ఏకైక ఎమ్మెల్యే  అదే జగన్‌కు పాలాభిషేకం చేయడం గమనార్హం.

వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రకటించినందున ముఖ్యమంత్రిని అభినందిస్తూ ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. ఆటోడ్రైవర్లతో కలిసి ఆయన వైఎస్ జగన్ కు అనుకూలంగా నినాాదాలు చేశారు.  వైఎస్ జగన్‌ను మనసున్న నాయకుడిగా అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న ముఖ్యమంత్రిని తాను చూడలేదని అన్నారు. బడ్జెట్ గురించి ఎంత మాత్రం ఆలోచించకుండా బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. ప్రజలను ఆకట్టుకునే సంక్షేమ పథకాలను ఎన్నికల సంవత్సరంలో అమలు చేసే ప్రభుత్వాలను తాను ఇప్పటిదాకా చూశానని, దీనికి భిన్నంగా వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ చిత్ర పటానికి పినిపె విశ్వరూప్, రాపాక వరప్రసాద్ లు ఆటోడ్రైవర్లతో కలిసి పాలాభిషేకం చేశారు.