ఏపీని శాశ్వత రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టారు: పవన్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ఏపీలో కొత్త ఇసుక విధానం పేరుతో నిర్మాణరంగాన్ని తిరుగోమనంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ఇసుక లేక 35లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఏపీని శాశ్వత రాజధానిలేని రాష్ట్రంగా నిలబెట్టారని, రాజధానిప్రాంత అన్వేషణ, నిపుణులకమిటీ పరిశీలన అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంలో బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామ […]

ఏపీని శాశ్వత రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టారు: పవన్
Follow us

|

Updated on: Oct 19, 2019 | 1:43 AM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ఏపీలో కొత్త ఇసుక విధానం పేరుతో నిర్మాణరంగాన్ని తిరుగోమనంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ఇసుక లేక 35లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఏపీని శాశ్వత రాజధానిలేని రాష్ట్రంగా నిలబెట్టారని, రాజధానిప్రాంత అన్వేషణ, నిపుణులకమిటీ పరిశీలన అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంలో బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

గ్రామ సచివాలయ నియామకాల్లో చోటు చేసుకున్న గందరగోళాలు, నియామకాల్లో తప్పిదాల మూలంగా ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతలో నిరాశానిస్పృహలు నెలకొన్నాయని జనసేన పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఇప్పుడు ఏపీపీఎస్సీలో మార్పులు పేరుతో రాత పరీక్షతోనే నియామకాలు అంటే – పేపర్ లీకేజ్ లాంటి అక్రమాలు తలెత్తితే ప్రతిభావంతులు అన్యాయం అయిపోతారనే ఆందోళన యువతలో నెలకొంది అని గుర్తించింది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మె సమస్యను పరిష్కరించాలని పవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీకి సిద్ధమేనని పొలిట్‌ బ్యూర్‌ స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులు రేపు తలపెట్టిన తెలంగాణ బంద్‌కు జనసేన మద్దతు తెలిపింది. తెలంగాణలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కూడా జనసేన  పొలిట్ బ్యూరోలో చర్చ జరిపింది.