AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ మరో గుడ్ న్యూస్..!

లక్షల మంది ప్రయాణికులను నిత్యం గమ్యస్థానానికి చేరుస్తున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల‌ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో మార్గదర్శకాలను సవరించింది. గతంలో ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంటేనే, ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇచ్చే పథకానికి అర్హత సాధిస్తారు. అయితే, తాజాగా ఆ నిబంధనలను మార్చింది. కుటుంబంలో భార్య పేరు మీద ఆటో ఉండి.. భర్త నడుపుతున్నా కూడా అతడికి రూ.10వేలు అందిస్తారు. కుటుంబంలో ఎవరి పేరు […]

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ మరో గుడ్ న్యూస్..!
Vahanamitra
Ram Naramaneni
|

Updated on: Oct 19, 2019 | 3:40 AM

Share

లక్షల మంది ప్రయాణికులను నిత్యం గమ్యస్థానానికి చేరుస్తున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల‌ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో మార్గదర్శకాలను సవరించింది. గతంలో ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంటేనే, ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇచ్చే పథకానికి అర్హత సాధిస్తారు. అయితే, తాజాగా ఆ నిబంధనలను మార్చింది. కుటుంబంలో భార్య పేరు మీద ఆటో ఉండి.. భర్త నడుపుతున్నా కూడా అతడికి రూ.10వేలు అందిస్తారు. కుటుంబంలో ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఈ పథకం కింద లబ్ధిదారుడిగా అర్హత సాధిస్తారు.

  1. లబ్దిదారుడి తండ్రి(లేదా) తల్లి(లేదా) కూతురు(లేదా)తమ్ముడి(లేదా) భార్య పేరుతో ఆటో ఉన్నా వర్తిస్తుంది.
  2. ఇద్దరి పేర్లు వేర్వేరు రేషన్ కార‌్డుల్లో ఉన్నా పథకం కింద అర్హులు అవుతారు.
  3. బ్యాంకు అకౌంట్ మాత్రం ఆటో యజమాని పేరుతోనే ఉండాలని నిబంధన విధించారు.
  4. లబ్ధిదారుడికి, ఆటో యజమానికి ఉండే బంధాన్ని గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ ధ్రువీకరించాలి.

దీంతోపాటు తెల్ల రేషన్ కార్డులో పేరు లేదన్న కారణంతో తిరస్కరించిన దరఖాస్తులకు మరో అవకాశం కల్పించనున్నారు. గతంలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు మరో సారి అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులు ఆన్ లైన్లో అప్ లోడ్ చేసేందుకు గడువు అక్టోబర్ 30 వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఆన్‌లైన్లో అప్లై చేసుకోలేకపోతే.. పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, వార్డ్ వాలంటీర్, గ్రామ వాలంటీర్ల వద్ద నేరుగా ఇచ్చేందుకు కూడా అవకాశం కల్పించింది. నవంబర్ 8 కల్లా దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసి, 10వ తేదీ వరకు అర్హులను జిల్లా కలెక్టర్ ఫైనల్ చేయనున్నారు. నవంబర్ 15న డ్రైవర్ల ఖాతాలోకి నగదు బదిలీ చేయనున్నారు.