Vizianagaram: బొబ్బిలి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు బెల్లం రైతులు.. జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నమ్మించి రైతాంగాన్ని మోసగిస్తోందని మండిపడ్డారు బెల్లం రైతులు. షుగర్ ఫ్యాక్టరీ లేకపోవడంతో బెల్లం తయారు చేస్తే టిటిడికి విక్రయించే ఏర్పాట్లు చేస్తామని ప్రజాప్రతినిధులు గతంలో హామీ ఇచ్చారనీ, కానీ .. ఇప్పుడు మాత్రం తమను పట్టించుకోవడంలేదంటూ మండిపడ్డారు. చెరుకు తోలేందుకు షుగర్ ఫ్యాక్టరీ లేక, తయారు చేసిన బెల్లం అమ్ముకునే దిక్కులేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా తమకు జరిగిన నష్టానికి వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ బాధ్యత వహించాలన్నారు. తక్షణమే రైతాంగాన్ని ఆదోకోవాలని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము తయారుచేసిన బెల్లాన్ని ముందుపెట్టుకొని నిరసనకు దిగారు బెల్లం రైతులు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కలెక్టరేట్‌లోకి దూసుకొస్తోన్న బెల్లం రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..