జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన వారాహి యాత్ర నేతల మాటల మంటలను రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ కాకినాడ బహిరంగ సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ పై చేసిన వ్యాఖ్యలు.. ఆరోపణలపై మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ సంచలనం సృష్టించారు. జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభంకు రాసిన బహిరంగ లేఖపై జనసేన నేతలు, కార్యకర్తల సహా పలువురు కాపు నేతలు స్పందిస్తున్నారు. ముద్రగడ తీరు సరికాదంటూ హితవు పలుకుతున్నారు.
ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ప్రముఖ జనసేన నేత జనసేన పార్టీ పిఏసీ సభ్యులు పంతం నానాజీ భిన్నంగా స్పందించారు. మేము ఎవరి ఋణం ఉంచుకోము.. ఎవరిది వారికి తిరిగి ఇచ్చేస్తాం అంటూ ముద్రగడ కి ఉప్మా డబ్బులు తిరిగి పంపారు పంతం నానాజీ. అంతేకాదు మీరు పవన్ కళ్యాణ్ కు పంపిన లేఖలో ముద్రగడ చెప్పిన మాటలను బట్టి ఉద్యమ సమయంలో తాము తిన్నది ద్వారంపూడి ఉప్మా అని తేలిందని.. కనుక తాము ఆ సమయంలో తిన్న సందర్భాలు అన్ని లెక్క పెట్టుకుంటే .. సుమారు రూ. 1000 తేలిందన్నారు. అందుకనే మీకు ఇప్పుడు ఆ ఉప్మా డబ్బులు మీకు పంపుతున్నానని.. దయచేసి ఈ డబ్బులను ద్వారంపూడి గారికి తిరిగి ఇచ్చేయమని ముద్రగడ పద్మనాభాన్ని కోరారు పంతం నానాజీ. అంతేకాదు మీకు కుడా ద్వారం పూడి ఉప్మా డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అనిపిస్తే మీరు తిరిగి పంపేయండని కూడా ముద్రగడకు సలహా కూడా ఇచ్చారు పంతం నానాజీ..
పంతం నానాజీ తో పాటు.. ఉద్యమ సమయంలో తాము తిన్న ఉప్మాకు డబ్బులను లెక్కపెట్టి..మరికొందరు డబ్బులను మానియార్డర్ చేశారు. దాదాపు దాదాపు 20 గ్రామాల నుండి వంద మంది జనసేన శ్రేణులు మనీ ఆర్డర్ ద్వారా ముద్ర గడకు డబ్బులను పంపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..