ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, జనసేన లీడర్ నాగబాబు.. మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు, సెటైర్లు వేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. తాజాగా.. ఏపీ మంత్రి రోజాపై జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ సెటైర్లు వేశారు. నిండ్ర మండలం బీజీ కండ్రిగ, ఎంసీ కండ్రిగ గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రూ.11 లక్షలు నిధులు మంజూరయ్యాయి. వాటితో గ్రామాల్లో తాగునీటి బోరు, పైపులైన్లకు మంత్రి రోజా పూజ చేసి ప్రారంభించారు. గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఆత్మసంతృప్తి కలిగించిందని మంత్రి రోజా అన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే.. తాజాగా వీటిపై జనసేన లీడర్ నాగబాబు స్పందించారు. హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా!. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం.’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను జనసైనికులు తెగ షేర్ చేస్తున్నారు. మంత్రి రోజాను టార్గెట్‌గా చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన రోజా @RojaSelvamaniRK
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం. pic.twitter.com/PXcD9tIurA
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 11, 2023
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి