Nagababu: రెండు చోట్ల ఓటుపై స్పందించిన జనసేన నేత నాగబాబు.. ఏమన్నారో తెలుసా..?

|

Dec 17, 2023 | 4:55 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దొంగ ఓట్ల వ్యవహారం ఏపీ నుంచి ఢిల్లీ వరకు చేరింది. ఈ క్రమంలోనే.. ఏపీలో జనసేన నేత నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం.. ఈ అంశంలో వైసీపీ విమర్శలు చేయడం ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించింది.

Nagababu: రెండు చోట్ల ఓటుపై స్పందించిన జనసేన నేత నాగబాబు.. ఏమన్నారో తెలుసా..?
Nagababu
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దొంగ ఓట్ల వ్యవహారం ఏపీ నుంచి ఢిల్లీ వరకు చేరింది. ఈ క్రమంలోనే.. ఏపీలో జనసేన నేత నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం.. ఈ అంశంలో వైసీపీ విమర్శలు చేయడం ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించింది. ఓటు హక్కు కోసం నాగబాబు దరఖాస్తు చేయడంపై వైసీపీ నేతలు పలు ఆరోపనలు చేశారు. తెలంగాణలో ఓటు వేసిన నాగబాబు.. ఏపీలో కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారనంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. రెండు చోట్ల ఓటు ఎలా వేస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వ్యవహారంపై జనసేన నేత నాగబాబు స్పందించారు. తాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని నాగబాబు తెలిపారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదని స్పష్టంచేశారు. అంతేగాక ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందన్నారు. హైదరాబాదులో ఉన్న ఓటును రద్దు చేసుకున్నానని నాగబాబు తెలిపారు.

తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని నాగబాబు స్పష్టంచేశారు. ఎంపీగా పోటీ చేస్తా అనేది ప్రచారం మాత్రమేనని.. తెలిపారు. తనకు రెండు ఓట్లు ఉన్నాయన్నది అవాస్తవమని.. తన ఓటును మంగళగిరికి మార్చుకుంటున్నానని నాగబాబు వివరించారు. వైనాట్‌ వైసీపీ జీరో.. అనేది తమ నినాదమన్నారు.

కాగా.. ఇదే విషయంపై నిన్న వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు.. జనసేన నేత నాగబాబుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటు వేశాక.. ఏపీకి మార్చుకోవడం అనైతికం అన్నారు. ఈ కామెంట్లపై స్పందించిన నాగబాబు ఎలక్షన్ స్పిరిట్ కొనసాగిస్తానంటూ కౌంటర్ ఇవ్వడం.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..