Nagababu: ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు.. తెలంగాణలో ఓటు వేశారంటూ వైసీపీ ఆరోపణ

|

Dec 16, 2023 | 9:23 PM

జనసేన నేత నాగబాబు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగబాబుకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉంది. దాన్ని రద్దు చేసుకుని ఏపీలో ఓటు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు.

Nagababu: ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు.. తెలంగాణలో ఓటు వేశారంటూ వైసీపీ ఆరోపణ
Nagababu Ambati Rambabu
Follow us on

జనసేన నేత నాగబాబు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగబాబుకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉంది. దాన్ని రద్దు చేసుకుని ఏపీలో ఓటు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డోర్ నెంబర్ లో విచారణ చేయగా తాళం వేసి ఉంది. దాంతో బూత్ లెవల్ ఆఫీసర్ పక్కన ఇంటి వారికి సమాచారం అందించారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగబాబును తమ వద్ద హాజరు కావాలని బీఎల్వో నోటీసు ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో నాగబాబు ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుందని, ఇప్పుడు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని వైసీపీ ఆరోపించింది. ఇది అనైతికమని విమర్శించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో నాగబాబు కుటుంబం ఓటు వేసిందని.. పోలింగ్ బూత్ 168లో కొణిదెల నాగబాబు, కొణిదెల పద్మజ, వరుణ్ తేజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ఆరోపించింది. తెలంగాణలో ఓటు ఉండగా, ఇప్పుడు ఏపీలో కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవడంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో ఓటు వేసిన వారికి ఏపీలో ఓటు వేసే అవకాశం కల్పించకూడదని వైసీపీ వాదిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నాగబాబు అంశం తెరపైకి రావడం.. దీనిపై వైసీపీ విమర్శలు గుప్పించడంతో.. జనసేన ఏ రకంగా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..