Janasena: వైసీపీని ఇంటికి పంపేందుకు ఎంత శాతం మంది రెడీగా ఉన్నారో చెప్పిన నాదెండ్ల మనోహర్

|

Aug 14, 2022 | 5:58 PM

వచ్చే మార్చిలోనే ఏపీలో ఎన్నికలు. అందుకే ఈ అక్టోబర్ ఐదు నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర ఉంటుందని అన్నారు జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్.

Janasena: వైసీపీని ఇంటికి పంపేందుకు ఎంత శాతం మంది రెడీగా ఉన్నారో చెప్పిన నాదెండ్ల మనోహర్
Nadendla Pawan Kalyan
Follow us on

Andhra Pradesh: అక్టోబర్ ఐదు.. విజయదశమి రోజున.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాష్ట్ర యాత్ర.. ప్రారంభం. తిరుపతి నుంచి ఈ యాత్ర మొదలు కానుందని ప్రకటించారు- జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar). 2023 మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశముందనీ.. సైనికులుంతా యుద్ధానికి సదా సిద్ధంగా ఉండాలనీ… పిలుపునిచ్చారు నాదెండ్ల మనోహర్. వైసీపీ గవర్నమెంట్ ను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారనీ. రాష్ట్రంలో 73 శాతం మంది ప్రజలు.. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయనీ అన్నారు నాదెండ్ల. మంగళగిరిలో జనసేన ఐటీ వింగ్ సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియాది కీలక పాత్రగా చెప్పారు నాదెండ్ల. ఏపీలో రాన్రాను ఐటీ దిగజారిపోతోందనీ.. దావోస్ లో ఫోటోలకు పోజులిస్తే పెట్టుబడులు రావనీ. ఏపీకీ పెట్టుబడులు రాకుండా చేస్తున్నారనీ.. అందుకే సేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. జనసేన షణ్ముఖ వ్యూహం గురించి వివరిస్తారని చెప్పారు మనోహర్.

వైసీపీ నేతలు చేపట్టిన గడపగడపకీ కార్యక్రమంలో ఎదురవుతున్న చీత్కారాలను చూస్తుంటే ముందస్తు ఎన్నికలు తప్పక వస్తాయనీ.. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించేందుకు జనసైనికులంతా సమాయత్తం కావాలని సూచించారు.. నాదెండ్ల మనోహర్.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి