Pawan Kalyan: సిద్ధమైన జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచార రథం.. అచ్చం అలాగే ఉందంటున్న అభిమానులు..

|

Nov 25, 2022 | 3:48 PM

జనంలోకి వెళ్లేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టబోయే..ప్రచార యాత్ర మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ ఇదే వ్యాన్‌ను ఉపయోగించనున్నారు.

Pawan Kalyan: సిద్ధమైన జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచార రథం.. అచ్చం అలాగే ఉందంటున్న అభిమానులు..
Pawan Kalyan Pracharam
Follow us on

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచార రథం శరవేగంగా రెడీ అయ్యింది. ఈ ప్రచార రథంలోనే జనసేన అధినేత పవన్ కల్యాన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారు. జనంలోకి వెళ్లేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టబోయే..ప్రచార యాత్ర మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ ఇదే వ్యాన్‌ను ఉపయోగించనున్నారు. అయితే సేనాని ప్రచార యాత్ర కోసం ఈ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసింది జనసేన. ఈ రథం మీదుగానే జనసేనాని ఎన్నికల సమరశంఖం మోగిచనున్నారు. జనంలోకి వెళ్లేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టబోయే.. వ్యాన్ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సును ప్రత్యేకంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ బస్సు పనులు ముగిశాయి.

అత్యాధినిక టెక్నాలజీతో.. మెరుగైన హంగులతో రూపుదిద్దుకున్న ఈ వాహనాన్ని పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పరిశీలించారు. అయితే ముందుగా ఈ వాహనాన్ని పుణెలో రెడీ చేద్దామని అనుకున్నారు పార్టీ నేతలు. కానీ పవన్ సూచనలతో హైదరాబాద్‌లోనే సిద్ధం చేశారు. ఇక్కడే వాహనాలు రెడీ అవుతుండడంతో పవన్ ఎప్పటికప్పుడు స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు.

ఆయనే కొన్ని సూచనలు చేశారు. ఆయన సూచనల ప్రకారమే ప్రచార రథం సంసిద్ధం చేసింది పార్టీ క్యాడెర్. సినిమా క్యారీ వ్యాన్‌లా కాకుండా.. ప్యూర్ పొలిటికల్ మోడల్‌తో ప్రచార రథం సిద్ధం చేశారు. ఇది కొద్ది తెలుగు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ ఉపయోగించిన చైతన్య రథం తరహాలో ఉండటం విశేషం.

అయితే ఈ వాహనానికి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇందులో కనీసం ఆరుగురు కూర్చుని చర్చించుకునేలా కన్వెట్టబుల్ సిట్టింగ్ రూమ్ ఒకటి ఉంది. సమావేశాలకు అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. నిఘా నేత్రం మధ్య వాహనం ఉంటుంది.

అంటే చుట్టూ చాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనంను 360 డిగ్రీలతో ఎప్పటికప్పుడు పరిశీలించేలా కెమెరాలు ఉన్నాయి. అలాగే వాహనం బాడీకి రెండు వైపులా సెక్యూరిటీ గార్డులు నిలబడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వపన్ కల్యాన్ ఉపయోగించే ప్రచార రథంను ఇక్కడ చూడండి..

Pawan Kalyan Prachara Ratham

హై సెక్యూరిటీ సిస్టమ్ విత్ జీపిఎస్ ట్రాకింగ్ ఫిట్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వాహనం టాప్ పైకి పవన్ చేరేందుకు లోపల నుండే పవర్ లిఫ్ట్ సిస్టమ్ ఏరేంజ్ చేశారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు పవన్ ప్రజలందరికి కనిపంచేలా చిన్న డయాస్‌ను డిజైన్‌ను.. అలాగే జనసేనాని మాట్లాడుతున్నప్పుడు అన్ని వైపులకు సమాన స్థాయిలో వినిపించేందుకు లేటెస్ట్ సౌండ్ సిస్టం, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు.

జనసేనాని ఉపయోగించే ఈ వాహనంకు మిలటరీ గ్రీన్ రంగును వేశారు. అచ్చం మిలటరీ వాహనం మాదిరిగానే పవన్ యాత్ర చేయబోయే వాహనానికి తుది మెరుగులు దిద్దారు. అయితే మొదట ఏపీ వ్యాప్తంగా జన యాత్రకు శ్రీకారం చుట్టాలని జనసేన అధినేత ప్లాన్ చేస్తున్నారు. విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ సైతం ప్రకటన చేశారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం