తిరుపతి జిల్లా చంద్రగిరిలోని నూకలగుంట సచివాలయం సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ముళ్ల పొదల్లో దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండటంతో ఐదు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మద్యం బాటిళ్లు దొరకడంతో అనుమానాలు తలెత్తాయి.