Janasena Party: రావులపాలెం చేరుకున్న జనసేనాని.. అడుగడుగునా జనసంద్రం.. ఓ రైతు అరటిగెల గిఫ్ట్..

|

Feb 20, 2022 | 5:28 PM

Janasena Party: జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్(Pawan Kalyan) నరసాపురం(Narasapuram)లో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొనేందుకు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి..

Janasena Party: రావులపాలెం చేరుకున్న జనసేనాని.. అడుగడుగునా జనసంద్రం.. ఓ రైతు అరటిగెల గిఫ్ట్..
Pawan Klayan
Follow us on

Janasena Party: జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్(Pawan Kalyan) నరసాపురం(Narasapuram)లో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొనేందుకు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు.  పవన్ కళ్యాణ్ వెంట PAC సభ్యులు  నాగబాబు కూడా ఉన్నారు. విమానాశ్రయంలో జనసేన అధినేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ  నుంచి రోడ్డు మార్గం ద్వారా నరసాపురం బయలుదేరారు.  అయితే నరసాపురానికి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా కోనసీమ ముఖ ద్వారం రావులపాలెం మీదుగా వెళ్తున్నారు.

అయితే జనసేనానికి  రావులపాలెంలో వేలల్లో అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతున్నారు.  అయితే ఇంత జన ప్రవాహంలో కూడా ఓ రైతు.. ఎర్రపండ్లు ఉన్న అరటి గెలను పవన్ కళ్యాణ్ కు ప్రేమగా ఇచ్చాడు. ఆ గెలను అంత జనంలో కూడా పవన్ కళ్యాణ్ ఎంతో ప్రేమగా తీసుకుని తన కాన్వాయ్ లో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తమ పార్టీ అధినేత పవన్ కు స్వాగతం పలికిన వారిలో PAC సభ్యులు పితాని బాలకృష్ణ,  మేడా గురుదత్ ప్రసాద్,   డి ఎం ఆర్ శేఖర్,   వై. శ్రీనివాస్,   బండారు శ్రీనివాస్,   పాటంసెట్టి సూర్యచంద్ర,  అత్తి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Also Read:

బుక్ మై షో కు షాక్ ఇచ్చిన భీమ్లానాయక్ డిస్టిబ్యూటర్స్.. కారణం ఇదే.