Pawan Kalyan: ముందుచూపు లేకపోతే ఇలాంటి దారుణాలే చూడాల్సి వస్తుంది.. వైసీపీకి పవన్ కల్యాణ్ కౌంటర్

|

Aug 14, 2022 | 9:52 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికారం కోసమే పాలిటిక్స్ లోకి రాలేదన్న జన సేనాని.. పార్టీ పెట్టగానే అద్భుతాలు జరిగిపోతాయని తాను అనుకోవడం లేదని...

Pawan Kalyan: ముందుచూపు లేకపోతే ఇలాంటి దారుణాలే చూడాల్సి వస్తుంది.. వైసీపీకి పవన్ కల్యాణ్ కౌంటర్
Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికారం కోసమే పాలిటిక్స్ లోకి రాలేదన్న జన సేనాని.. పార్టీ పెట్టగానే అద్భుతాలు జరిగిపోతాయని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. నాయకత్వానికి ముందు చూపు లేకపోతే ఎన్నో దారుణాలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విభజన వల్ల ఎంతో రక్తపాతం జరిగిందన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేశఆరు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశ జీవన విధానంలోనే ఉందని స్పష్టం చేశారు. కోట్లాది మందికి నిర్దేశం చేయాలంటే పొలిటికల్ గా చాలా అనుభవం సంపాదించాలని పవన్ పేర్కొన్నారు. గడిచిన 15 ఏళ్లల్లో తాను ఎన్నో అనుభవాలు సంపాదించానని, అనుభవం లేకుండా పదవులు వస్తే వైసీపీ పాలనలా ఉంటుందని ఎద్దేవా చేశారు. పదవి వెతుక్కుంటూ రావాలి గానీ మనం పదవి వెంట పడకూడదని చెప్పారు. ఏపీలో జనసేన (Janasena) అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి ఐటీ రంగానికి మహర్దశ వస్తుందని అన్నారు. కంపెనీలు ఆంధ్రకు తరలివచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఐటీ విభాగం రాష్ట్రస్థాయి మీటింగ్ లో ఆయన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రజల ఆశలతో ఆటాడి వారిని మభ్యపెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇష్టారీతిన హామీలు ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఇలాంటి ప్రభుత్వంపై స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి. నాకు భవిష్యత్ పై భయాలు లేవు. రాబోయే తరాలను, వారి భవిష్యత్తును తలుచుకుంటే భయంగా ఉంది. వారికి ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అప్పుల ఊబిలో పడేస్తున్నారు. అలా చేస్తే రాష్ట్రం ఎలా ఆర్థికంగా పుంజుకుంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌, బెంగళూరులో ఐటీ అభివృద్ధి చెందింది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కవస్థాయిలో ఐటీని అభివృద్ధి చేస్తా.

 – పవన్ కల్యాణ్, జనసేన అధినేత

ఇవి కూడా చదవండి

దావోస్‌ వెళ్లి ఫొటోలు దిగినంత మాత్రానా రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు వచ్చినట్లు కావని పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..