సీఎం జగన్ పాలనపై.. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్స్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావడంతో.. జనసేనాని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో తెలుగులో ట్వీట్లు చేస్తూ.. జగన్ పరిపాలనను ఎండగట్టారు. ఆరు నెలల పాలనపై ఆరు ముక్కల్లో అంటూ.. ట్వీట్ చేశారు. గడిచిన ఆరునెలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్న ఆయన.. కేవలం విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే […]

సీఎం జగన్ పాలనపై.. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్స్..

Edited By:

Updated on: Nov 23, 2019 | 1:19 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావడంతో.. జనసేనాని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో తెలుగులో ట్వీట్లు చేస్తూ.. జగన్ పరిపాలనను ఎండగట్టారు. ఆరు నెలల పాలనపై ఆరు ముక్కల్లో అంటూ.. ట్వీట్ చేశారు. గడిచిన ఆరునెలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్న ఆయన.. కేవలం విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే అంటూ తొలి ట్వీట్ చేశారు. అనంతరం ఆ ఆరు పదాలకు ఒక్కో ట్వీట్ చేస్తూ వివరణ ఇచ్చారు.

కాగా, గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ తెలుగులోనే ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జగన్ సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించాలని నిర్ణయం తీసుకోవడంతో.. తెలుగును బతికించాలంటూ.. ట్విట్టర్ వేదికగా ఫైట్ చేయడం ప్రారంభించారు. “మాతృ భాషని ,మృత భాషగా మార్చకండి” అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వరుస ట్వీట్లు చేశారు. ఇక అప్పటి నుంచి పవన్ దాదాపు తెలుగులోనే ట్వీట్లు చేస్తున్నారు. ఇక పవన్ చేసిన ఈ ట్వీట్లు గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారుతున్నాయి.

ఇదిలా ఉంటే.. పవన్ చేస్తున్న ట్వీట్స్‌పై వైసీపీ నేతలు కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతున్నారు. దీంతో మళ్లీ పార్టీల మధ్య ట్విట్టర్ వార్‌కు తెరలేచింది.