Pawan Kalyan: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్(Pawan Kalyan) నరసాపురం(Narasapuram)లో నిర్వహిం మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కులాలను విడగొట్టి పాలించే విధాన్ని మార్చుకుని.. కులాలను కలుపుతూ వెళ్లే విధానాన్ని పాటించాలని కోరారు. తనను ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుందని.. తాను అలా ఒక కులాన్ని మోసే వ్యక్తిని అయితే.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయనని చెప్పారు. తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లను చూశాం.. జగన్ మోహన్ రెడ్డి పార్టీని కూడా గత కొంతకాలంగా చూశాము.. ఇప్పుడు సరికొత్త పార్టీ విధాన్ని చూడాలని కోరారు. తాను 25 ఏళ్ల ప్రణాళికతో వచ్చానని.. తాను ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులను అర్ధం చేసుకోవాలని భావించి.. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నామని తెలిపారు.
తాను సభకు వచ్చే దారిలో రోడ్లు సరిగ్గా లేవని..మనం వచ్చే దారిలో మనం రోడ్లు వేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మత్య్సకారులు వేటకు వెళ్లే సమయంలో అండగా ఉండే పరిస్థితులు కావాలని సూచించారు. ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడికి వెళ్లినా అందరు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని.. వారికీ ఉద్యోగ కల్పన చేయాలనీ కోరారు. జనసేన మానిఫెస్టోని రేపు రిలీజ్ చేయబోతున్నామని.. అయితే ఫైనల్ మానిఫెస్టోలో సమస్యలను పరిష్కారం చూపించే దిశగా ఉంటుందని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నమ్మకం కోల్పోయిందని.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా కాపు, ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ లో అవకతవకలున్నాయని తెలిపారు. యువతకు అండగా నిలబడానికి ఈ కార్పొరేషన్లు ఉన్నాయని.. అయితే అక్కడ అన్ని చోట్లా లంచాలు తీసుకుంటూ యువతను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు.
16 వ శతాబ్దంలో ఉన్న విధంగా మరపడవలు తయారు చేసే విధంగా ఓ పరిశ్రమ స్థాపిస్తానని.. మత్య్సకారులు అండగా నిలబడేలా మేనిఫెస్టో రూపొందిస్తామని.. పచ్చిమ గోదావరి జిల్లాను టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతామని తెలిపారు. ఇక్కడ ఉన్న మహిళకు లెస్ అల్లిక ఓ సంపాదన మార్గమని.. దానిని ప్రోత్సహిస్తామని.. చేనేత కళలకు అండగా జనసేన పార్టీ అండగా నిలబడుతుందని మాట ఇచ్చారు జనసేనాని.తాను సినిమాలు చేసి సంపాదించాలని లేదని..ప్రజలకు బాధ్యతగా నిలబడాలని కోరారు.
అంతేకాదు ఈ సందర్భంగా కార్యకర్తలకు, నేతలకు పలు సూచనలు చేశారు.. పెద్దలకు గౌరవం ఇవ్వమని.. పార్టీకి గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తించమని చెప్పారు. అరుపులు కేకలతో సమాజంలో మార్పురాదని.. మీరు బాధ్యతగా మెలగాలని.. ఓట్లు రిజిస్ట్రర్ చేయించుకోవాలని కోరారు.
Also Read: