Pawan Kalyan: ఏపీలో రాజకీయం ఎప్పుడు హీట్ పుట్టిస్తూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీ నేతల, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ప్రభుత్వం చేస్తున్న పనులను ఎత్తి చూపితే.. జనసేన నాయకులపై కేసులు పెడతారా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు జనసేన పార్టీ ఎపుడూ బాధితుల పక్షాన నిలుస్తుందని చెప్పారు.
జనసేన నాయకులపై కేసులు అప్రజాస్వామికమని అన్నారు. విశాఖలో రాష్ట్ర మంత్రి అవంతి కాన్వాయ్ లోని వాహనం ఢీ కొనడంతో గేదెల సూర్యనారాయణ మృతి చెందడం ప్రతి ఒక్కరినీ కలిచివేసిందని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రమాదం బారినపడిన వ్యక్తి పరిస్థితి ఏమిటని కనీసం పరామర్శ కూడా చేయకుండా మంత్రి వెళ్లిపోవడం దురదృష్టకరమని అన్నారు.
కార్మికుడు న్యాయం చెయ్యాలని మంత్రిని అడగడానికి వెళ్లిన వారిపై అక్రమ కేసులు పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యతను తీసుకోవాలని జనసేన హేతుబద్ధంగా డిమాండ్ చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడే కాదు అనంతపురంలో కూడా ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులపై అధికార పార్టీ కేసులు పెట్టింది. న్యాయం కోసం మాట్లాడే పార్టీ నాయకులను, శ్రేణులను అరెస్టులు, కేసులతో కట్టడి చేయడం భావ్యం కాదని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
Also Read: తన చేతిమీద ఉన్న పచ్చబొట్లకు అర్ధం చెప్పిన ఇల్లీ బేబీ.. ఆ 3 చుక్కల అర్థం ఏమిటంటే..