Andhra Pradesh: ఏపీలో స్టిక్కర్‌ పాలిటిక్స్‌.. ‘జగనన్నే మా భవిష్యత్తు’కు పోటీగా రంగంలోకి జనసేన, టీడీపీ.

|

Apr 10, 2023 | 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ స్టిక్కర్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. దేశ చరిత్రలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీలోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ వైసీపీ స్టిక్కర్‌ క్యాంపెయిన్‌ చేస్తోంది. లక్షల మంది పార్టీ సైన్యం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాభిప్రాయం...

Andhra Pradesh: ఏపీలో స్టిక్కర్‌ పాలిటిక్స్‌.. జగనన్నే మా భవిష్యత్తుకు పోటీగా రంగంలోకి జనసేన, టీడీపీ.
Andhrapradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ స్టిక్కర్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. దేశ చరిత్రలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీలోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ వైసీపీ స్టిక్కర్‌ క్యాంపెయిన్‌ చేస్తోంది. లక్షల మంది పార్టీ సైన్యం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతున్న సాయంపై ఆరా తీస్తూనే.. మిగిలిన సమస్యలు తెలుసుకునే ప్రయత్నిస్తోంది. ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తూ వచ్చే ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతుంటే.. ప్రత్యర్ధి పార్టీలు కూడా జనాల్లో ఉండేందుకు కొత్త దారులు వెతుకుతున్నాయి. గడపగడపకు అంటూ జనాల్లోకి కేడర్‌ను పంపిన జగన్‌… ఇప్పుడు ఈ వినూత్న కార్యక్రమంతోనూ విపక్షాలకు సరికొత్త సవాల్‌ విసిరారు.

దేశ చరిత్రలో తొలిసారిగా వైసీపీ 7లక్షల మంది పార్టీ సైన్యాన్ని రంగంలో దించి మరీ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం సేరుతో జనాల్లోకి వెళుతోంది. కోటీ 60లక్షల ఇళ్లకు వెళ్లి పథకాలు వివరించి ప్రజా మద్దతు కూడగట్టేందుకు కేడర్‌ ఇంటింటికి వెళుతున్నారు. పాలనపై ప్రజాభిప్రాయం తీసుకోవడంతో పాటు.. అనుమతిస్తే జగనన్నే మా భవిష్యత్‌.. నువ్వే మా నమ్మకం జగన్‌ అనే కొటేషన్స్‌తో ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తోంది వైసీపీ. భుజానికి సంచి, చేతిలో స్టిక్కర్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు దీనిని ఓ ఉద్యమంలా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.

కౌంటర్‌ అటాక్‌..

వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి రాయలసీమలో కౌంటర్‌ అటాక్‌ మొదలు పెట్టింది జనసేన. మాకు నమ్మకం లేదు జగన్‌.. మా నమ్మకం పవన్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో జనసేన కూడా.. వైసీపీ స్టిక్కర్ల దగ్గరే తమ పార్టీ స్టిక్కర్లు అతికించి వెళ్తోంది. అటు మరో ప్రతిపక్షం టీడీపీ కూడా పలుచోట్ల స్టిక్కర్‌ వార్‌కు తెరతీసింది. ఇక వైసీపీ నాయకులు బలవంతంగా స్టిక్కర్లు అంటిస్తున్నారని ఆరోపిస్తోంది బీజేపీ. పాలకులు ప్రజల గుండెల్లో ఉండాలి కానీ.. ఇళ్ల గోడలపై కాదంటూ విమర్శించారు ఈ పార్టీ నేతలు. మొత్తానికి నమ్మకం నిలబెట్టుకుని జనాల్లోకి వెళుతున్నామని వైసీపీ అంటోంది… విధ్వంసమే తప్ప పాలన లేదంటున్నాయి విపక్షాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..