భాష కాదు ముఖ్యం..! ఇంగ్లీష్ మీడియంపై స్పందించిన రంగరాజన్‌

|

Nov 23, 2019 | 3:37 PM

“భాష’ కాదు..విలువలతో కూడిన విద్య ముఖ్యమన్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌. శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగరాజన్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఇంగ్లీష్‌ మీడియంపై కొనసాగుతున్న చర్చపై స్పందించారు. తెలుగు గొప్పా, ఇంగ్లీష్‌ గొప్పా అనే వాదనలు పక్కన పెట్టి విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించేయాలన్నారు. తెలుగుకు తాను వ్యతిరేకం కాదని, అలాగని ఇంగ్లీష్ బాషకు కూడా అనుకూలం కాదని చెప్పారు. తమిళనాడు, కర్నాటక తరహాలో న్యాయస్థానాల్లో, […]

భాష కాదు ముఖ్యం..! ఇంగ్లీష్ మీడియంపై స్పందించిన రంగరాజన్‌
Follow us on
“భాష’ కాదు..విలువలతో కూడిన విద్య ముఖ్యమన్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌. శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగరాజన్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఇంగ్లీష్‌ మీడియంపై కొనసాగుతున్న చర్చపై స్పందించారు. తెలుగు గొప్పా, ఇంగ్లీష్‌ గొప్పా అనే వాదనలు పక్కన పెట్టి విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించేయాలన్నారు. తెలుగుకు తాను వ్యతిరేకం కాదని, అలాగని ఇంగ్లీష్ బాషకు కూడా అనుకూలం కాదని చెప్పారు. తమిళనాడు, కర్నాటక తరహాలో న్యాయస్థానాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మాతృభాష వాడుతున్నట్లుగా.. ఏపీలో కూడా తెలుగు వాడకం తీసుకురావాలన్నారు. అంతేకానీ.. పాఠశాలల్లో  ఏ మీడియం అన్నదానిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇక అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించిన సీఎం జగన్‌కు రంగరాజన్‌ కృతజ్ఞతలు తెలిపారు.