Weather Alert: అల్పపీడనానికి తోడైన ఉపరితర ద్రోణి.. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..

|

Sep 11, 2022 | 3:07 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి...

Weather Alert: అల్పపీడనానికి తోడైన ఉపరితర ద్రోణి.. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
Ap Weather Aler
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది కళింగపట్నం, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం వల్ల సముద్రం వైపు ఉన్న తేమ మేఘాల ద్వారా భూమి పైకి విస్తరించాయి. దీంతో భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయని వెల్లడించారు. దీనికి అనుబంధంగా తూర్పు ఆగ్నేయ దిశగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఏర్పడింది. అల్పపీడనం, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని అంచనా వేసినప్పటికీ అది వాయుగుండంగా మారేందుకు అనువైన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల, మిగిలిన కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని గోవిందపురంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 8.5, పల్నాడు జిల్లా చాగల్లులో 8.3 సెంటీ మీటర్లు వర్షం కురిసింది. విజయవాడ నగర పరిసరప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని మహేంద్ర తనయ గెడ్డ పొంగి పొర్లుతోంది. ప్రమాదవశాత్తు అందులో పడి విశ్వనాథ్‌ అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..