
2025లో తొలి ప్రయోగం కమ్ వందో రాకెట్ ప్రయోగానికి ఇస్రో…రెడీ వన్ టూ త్రీ అంటోంది. ఈ కీలక రాకెట్ ప్రయోగానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా GSLV F-15 రాకెట్‌తో NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని…జియో ట్రాన్స్‌మిషన్ ఆర్బిట్‌లోకి పంపనుంది. దీనికోసం శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం విశేషాలేంటో తెలుసుకుందాం.
1980లో విజయవంతంగా తొలి శాటిలైట్ ప్రయోగం చేసింది ఇస్రో. ఈ నెల 29న వందో రాకెట్ ప్రయోగాని రెడీ అయింది. -GSLV F-15 రాకెట్ ద్వారా కక్ష్యలోకి NVS-02 శాటిలైట్ పంపనుంది. 36వేల కి.మీ. దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరనుంది ఈ శాటిలైట్. ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. పదేళ్ల పాటు ఈ శాటిలైట్ సేవలు అందించనుంది
ఇక ఈ ఉపగ్రహ ప్రయోగంతో భారత్‌కు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం…
గత ఏడాది, డిసెంబర్ 30 న ప్రయోగించిన PSLV- C 60 రాకెట్ ప్రయోగం ద్వారా 99 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో, మరో మూడు రోజుల్లో వందో ప్రయోగంతో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. 2025లోనూ అస్సల్ తగ్గేదేలే అంటోంది ఇస్రో. కొత్త ఏడాది ప్రారంభంలోనే మరో చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించింది భారత్. ఇప్పుడు ఈ వందో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రోకి TV-9 ఆల్ ది బెస్ట్ చెబుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..