International Flights: విజయవాడకు విదేశీ సర్వీసులు పునః ప్రారంభం.. దుబాయ్ నుంచి ప్రవాసాంధ్రులతో చేరుకున్న ప్రత్యేక విమానం

|

Jun 02, 2021 | 7:37 PM

ఆంధ్రప్రదేశ్‌కు నిలిచిపోయిన విదేశీ విమానాల రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.

International Flights: విజయవాడకు విదేశీ సర్వీసులు పునః ప్రారంభం.. దుబాయ్ నుంచి ప్రవాసాంధ్రులతో చేరుకున్న ప్రత్యేక విమానం
International Flights To Gannavaram Airport
Follow us on

International Flights to Gannavaram Airport: ఆంధ్రప్రదేశ్‌కు నిలిచిపోయిన విదేశీ విమానాల రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. దుబాయ్‌కి చెందిన 65 మంది ప్రవాసాంధ్రులతో కూడిన ప్రయాణికుల ప్రత్యేక విమానం ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో గత నెల 3 నుంచి ఇక్కడి విమానాశ్రయానికి విదేశీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకుంది.

అయితే, వందేభారత్‌ మిషన్‌లో భాగంగా తిరిగి ఇవాళ్టి నుంచి విమాన సర్వీసులను ప్రారంభించారు. దుబాయ్‌ నుంచి విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల భద్రతా, తనిఖీ ఏర్పాట్లను ఎయిర్‌పోర్టు అధికారులు పర్యవేక్షించారు. తొలుత థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీల అనంతరం రాష్ట్రంలోకి అనుమతినిచ్చారు. అలాగే ప్రవాసాంధ్రులను వారి వారి గమ్యస్థానాలు చేర్చేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Read Also…  Corona free village : మీ గ్రామాన్ని ‘కరోనా ఫ్రీ’గా చేసుకోండి, రూ. 50 లక్షలు బహుమతి పొందండి.. మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రకటన