
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి అభివద్ది పనులను షురూ చేసింది. కొత్తగా భవనాలు నిర్మించడంతో పాటు సీడ్ యాక్సెస్ నిర్మాణానికి సిద్దమైంది. సీడ్ యాక్సెస్ కోసం ఇప్పటికే భూసేకణ ప్రక్రియ పూర్తవ్వగా.. టెండర్ల ప్రక్రియ పూర్తి కావల్సి వస్తోంది. త్వరలోనే సీడ్ యాక్సెస్ నిర్మాణం మొదలు కానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను అందుబాటులోకి తీసుకొస్తుంది. అమారావతిలోని నలలూరు దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణం వేగంగా పూర్తవుతోంది. ప్రస్తుతం 90 శాతం పనులు పూర్తవ్వగా.. త్వరలో దీనిని ప్రారంభించనుంది.
24 ఎకరాల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నారు. 34 వేల మంది ఇక్కడ ఒకేసారి కూర్చోవచ్చు. తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ ఈ స్టేడియం నిర్మాణంపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పనులు వేగంగా జరుగుతున్నాయని, అంటూ ఓ వీడియోను మున్సిపల్ శాఖ పంచుకుంది. గుంటూరుకు 16 కిలోమీటర్లు, విజయవాడకు 13 కిలోమీటర్ల దూరంలో నవలూరు వద్ద స్టేడియం నిర్మాణం జరగుతుందని, 24 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని తెలిపింది. ఇందులో 34 వేల సీటింగ్ సామర్థ్యం ఉంటుందని స్పష్టం చేసింది. 90 శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే స్టేడియం ప్రారంభోత్సవం జరుగుతుందని పేర్కొంది.
ఈ ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణం కోసం రూ.110 కోట్లు ఖర్చు చేన్నట్లు ఏపీ మున్సిపల్ శాఖ తెలిపింది. ఈ స్టేడియంలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇండోర్ నెట్స్ తో పాటు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. వర్షం కురిసినా గంటలోనే మళ్లీ మ్యాచ్ నిర్వహించేలా లేటెస్ట్ డ్రైనేజీ వ్యవస్ధ ఉంటుంది. ఇక సీటింగ్ పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. ఇక ఫ్లడ్ లైట్లు, సెంట్రల్ ఏసీ, రంగులు, టైల్స్, ఎలక్ట్రిక్ పనులు పూర్తయ్యాయి. ఇక స్టేడియం బయట డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మిగతా చిన్న చిన్న పనులు కూడా పూర్తి కానున్నాయి. ఆ తర్వాత అంతర్జాతీయ స్టేడియం అమరావతిలో అందుబాటులోకి వస్తుందని ఏపీ మున్సిపల్ శాఖ తెలిపింది. రంజీ మ్యాచ్ లతో పాటు ఇంటర్నేషనల్ మ్యాచ్ లు కూడా ఇక్కడ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఏపీలోని విశాఖపట్నంలో మాత్రమే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అందుబాటులో ఉందనే విషయం తెలిసిందే.
రాజధాని అమరావతిలో నవులూరు వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పనులు దాదాపు 90శాతం పూర్తయ్యాయి.
– అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం#pongurunarayana #Amaravati #cricketstadium pic.twitter.com/5Xvq9LRY5S
— Municipal Department govt of Andhra pradesh (@CDMA_Municipal) January 30, 2026