Mobile Phones Closed: ఆంధ్రప్రదేశ్‌లో సమాచార శాఖలో సమస్య తలెత్తింది. ఆ శాకలో ఉన్న మొబైల్ ఫోన్లు మూగబోయాయి. సెల్‌ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవైడర్లు సర్వీసులను నిలిపివేశాయి. ఎన్నికల సమయంలో ఫోన్లు పని చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే బిల్లుకు సంబంధించిన ఫైల్ రాష్ట్ర ఆర్థిక శాఖ దగ్గర ఉండటంతో బిల్లులు చెల్లించలేకపోయారు. దీంతో ఈ సమస్య తలెత్తింది.
ఒక వైపు రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇలా సమయంలో ఒక్కసారిగా సమాచార శాఖ ఫోన్లు మూగబోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి పరిస్థితి ఎదురైంది.