AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక భక్తులకు ఇక్కట్లు!

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నా, తగిన వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాటేజీల కొరత వల్ల దర్శనం చేసుకుని వెంటనే వెనుదిరగాల్సి వస్తోంది. గత దశాబ్దంగా కాటేజీల నిర్మాణానికి అనేక ప్రతిపాదనలు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. భక్తుల సౌలభ్యం, ఆలయ ఆదాయం కోసం కాటేజీల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక భక్తులకు ఇక్కట్లు!
Indrakeeladri Pilgrim Accommodation Crisis
M Sivakumar
| Edited By: |

Updated on: Mar 27, 2026 | 4:28 PM

Share

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. అయితే ఇంత భారీగా భక్తుల రాకపోకలు ఉన్నప్పటికీ, వారికి తగిన వసతి సౌకర్యాలు మాత్రం అందుబాటులో లేవు. ముఖ్యంగా కాటేజీల కొరత భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.భక్తులు సాధారణంగా ఒకరోజైనా ఇంద్రకీలాద్రిపై ఉండి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ సరైన గదులు లేకపోవడంతో.. వచ్చి వెంటనే దర్శనం చేసుకుని తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కుటుంబాలతో వచ్చే వారికి ఇది మరింత ఇబ్బందిగా మారుతోంది.

గత 10-15 సంవత్సరాలుగా కాటేజీల నిర్మాణంపై అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. అధికారులు మారినప్పుడల్లా కొత్త ప్రణాళికలు రూపొందుతున్నా, వాటి అమలు మాత్రం జరగడం లేదు. దీంతో సమస్య అలాగే కొనసాగుతోంది. రైల్వే స్టేషన్ సమీపంలో కాటేజీలు, కల్యాణ మండపాలు నిర్మించాలని ఒక ట్రస్ట్ ప్రతిపాదించినా, అది కూడా అమలుకాలేదు. ఈ స్థలం రవాణా సౌకర్యాలకు దగ్గరగా ఉండటంతో భక్తులకు ఎంతో అనుకూలంగా ఉండేదని భావించారు. ప్రస్తుతం మాత్రం తాత్కాలికంగా డార్మెటరీలు ఏర్పాటు చేసి అవసరాన్ని తీరుస్తున్నారు.

ఇక కుమ్మరిపాలెం ప్రాంతంలో కూడా కాటేజీలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్థలాన్ని సర్దుబాటు చేయడానికే ఖర్చు పెట్టినా, ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. అలాగే భారీ స్థాయిలో కాటేజీలు, గెస్ట్ హౌసులు, పార్కింగ్, ఇతర సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ కూడా ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రణాళిక కూడా ముందుకు సాగలేదు. కాబట్టి ఇప్పటికైనా భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాటేజీల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. సరైన ప్రణాళికతో వసతి సదుపాయాలు పెంచితే భక్తులకు సౌకర్యం కలగడమే కాకుండా ఆలయానికి అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉందంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీమిండియాలో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
టీమిండియాలో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రత్నం ఓ వరం!.. ఏ వేలికి ధరించాలంటే..
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రత్నం ఓ వరం!.. ఏ వేలికి ధరించాలంటే..
నవపంచమి యోగం! పెళ్లి, సంపద, కెరీర్‌లో జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే
నవపంచమి యోగం! పెళ్లి, సంపద, కెరీర్‌లో జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే
ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక ఇక్కట్లు
ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక ఇక్కట్లు
ఆధార్, పాన్ వాడుతున్నారా..? కేంద్రం నుంచి పెద్ద ఊరట
ఆధార్, పాన్ వాడుతున్నారా..? కేంద్రం నుంచి పెద్ద ఊరట
15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఈ ఐపీఎల్లో వైభవ్ సాధిస్తాడా ?
15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఈ ఐపీఎల్లో వైభవ్ సాధిస్తాడా ?
ఏం సిరీస్ మావ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఏం సిరీస్ మావ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు
ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు
శ్రీరాముని శోభాయాత్రప్రత్యక్ష ప్రసారం..
శ్రీరాముని శోభాయాత్రప్రత్యక్ష ప్రసారం..
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. తాగితే ఏమవుతుందో తెలుసా..?
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. తాగితే ఏమవుతుందో తెలుసా..?