Andhra Pradesh: ఆ రైల్వేస్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్.. త్వరలో హోటల్‌లా మారనున్న ట్రైన్.. వివరాలివే..

Vijayawada: ఇండియన్ రైల్వే పర్యాటకులను ఆకట్టుకుంనేందుకు రైల్వే స్టేషన్ ఆవరణలో రైలు బోగీలను హోటల్స్‌గా మారుస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్ ప్రారంభిస్తున్నారు. త్వరలో హోటల్‌లామారబోతున్న రైలును

Andhra Pradesh: ఆ రైల్వేస్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్.. త్వరలో హోటల్‌లా మారనున్న ట్రైన్.. వివరాలివే..
Vijayawada Railway Restaurant

Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 22, 2023 | 11:30 AM

విజయవాడ న్యూస్, జూలై 22: ఇండియన్ రైల్వే పర్యాటకులను ఆకట్టుకుంనేందుకు రైల్వే స్టేషన్ ఆవరణలో రైలు బోగీలను హోటల్స్‌గా మారుస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్ ప్రారంభిస్తున్నారు. త్వరలో హోటల్‌లామారబోతున్న రైలును చూడండి.. ఇండియన్ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు, పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రాజెక్టులను చేపడుతోంది. దీన్లో భాగంగా విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్లలో కోచ్ రెస్టారెంట్లను ప్రారంభిస్తోంది. రైల్వే స్టేషన్లలో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కోచ్ రెస్టారెంట్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. త్వరలో ఈ బోగీ రెస్టారెంట్ రైల్వే ప్రయాణికులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా కోచ్ రెస్టారెంట్‌ను సందర్శించి ఫుడ్ ఆస్వాదించవచ్చు.

రైల్వే అధికారులు స్లీపర్ కోచ్‌కు మార్పులు చేసి రెస్టారెంట్‌గా మారుస్తున్నారు.. ఈ రెస్టారెంట్‌ను రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రారంభిచనున్నారు. కోచ్ రెస్టారెంట్ లోపల, బయట సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్ మంచి నాణ్యత గల ఆహారం తక్కువ ధరకే లభిస్తుదని. రైల్వే ప్రయాణికులకు 24 గంటల ఈ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుందని. ఈ రెస్టారెంట్ ద్వారా రైల్వేకు అదనంగా ఆదాయం వస్తుందని రైల్వే అధికారులు చెపుతున్నారు..